అన్వేషించండి
Akhanda: ఫైనల్ వర్క్స్‌లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన 'అఖండ' సెన్సార్ పూర్తయింది. ఇప్పుడు సినిమా డాల్బీ అట్మాస్ పనులు జరుగుతున్నాయి. Balakrishna

'అఖండ'లో బాలకృష్ణ
నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ సినిమా 'అఖండ'. ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. రీ-రికార్డింగ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పుడు డాల్బీ అట్మాస్ ఫైనల్ మిక్సింగ్ చేస్తున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఆ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆల్రెడీ సినిమా సెన్సార్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ మిక్సింగ్ పనులు కూడా పూర్తయితే విడుదలకు సినిమా పక్కాగా రెడీ అయినట్టే. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు పది రోజుల ముందే సినిమాను బోయపాటి శ్రీను రెడీ చేస్తున్నారు.
బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. 'జయ జానకి నాయక' తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. 'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా కూడా ఇదే. అందువల్ల, సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, సాంగ్స్ ఆ అంచనాలను పెంచాయి. బాలకృష్ణ అఘోరా గెటప్ సైతం సినిమాపై ఆసక్తి మరింత పెంచింది.View this post on Instagram
'అఖండ' సినిమాతో ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో, నటుడు శ్రీకాంత్ పూర్తిస్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఆయన ఎలా చేశారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషించారు. భారీ తారాగణం సినిమాలో ఉంది.
Also Read: విజయ్ దేవరకొండతో అనన్య పాండే హార్స్ రైడింగ్..
Also Read:ప్లాన్ మార్చేసిన 'విరాటపర్వం'.. ఓటీటీ డీల్ క్యాన్సిల్..
Also Read: సిరిని ఆటపట్టించిన రాజ్ తరుణ్.. యానీ, ప్రియాంకలలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
బిజినెస్
క్రైమ్
టీవీ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion