అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: 'వదిలేస్తున్నావా..?' అంటూ బాయ్ ఫ్రెండ్ డైలాగ్.. వెక్కి వెక్కి ఏడ్చేసిన సిరి..
ఈరోజు ఎపిసోడ్ లో స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున.. ఇవాళ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పగానే.. హౌస్ మేట్స్ ముఖాలు వెలిగిపోయాయి.
రెండు రోజులుగా బిగ్ బాస్ షోలోకి ఫ్యామిలీ మెంబర్స్ ను పంపించారు బిగ్ బాస్. ఈరోజు ఎపిసోడ్ లో స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున.. ఇవాళ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పగానే.. హౌస్ మేట్స్ ముఖాలు వెలిగిపోయాయి. ముందుగా రవి తల్లి స్టేజ్ పైకి వచ్చింది. ఎమోషనల్ అయిపోయిన రవిని చూస్తూ.. 'కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బిగ్‌బాస్ కి రాజావి' అంటూ డైలాగ్ వేసింది అతడి తల్లి.
ఆ తరువాత కమెడియన్ జబర్దస్త్ అప్పారావు స్టేజ్ పైకి వచ్చి శ్రీరామచండ్రని ఉద్దేశిస్తూ.. 'నువ్ ఎవరూ లేరని బాధపడుతున్నావ్ అని సాయిలేఖను తీసుకొచ్చా' అని చెప్పగా.. 'లోపలికి పంపండి' అని శ్రీరామ్ అనడం 'అంత కరువుగా ఉన్నావా..? నువ్' అని అప్పారావు కౌంటర్ ఇవ్వడంతో అందరూ నవ్వేశారు. సన్నీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందులో ఒక వ్యక్తి 'కప్పు ముఖ్యం బిగిలూ' అంటూ డైలాగ్ వేశాడు.
బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ కూడా స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. 'ఇప్పుడు తెలిసిందా బిగ్‌బాస్ అంటే ఏంటో' అని శివ బాలాజీ హౌస్‌మేట్స్ ను ఆటపట్టించారు. ఆ తరువాత నాగార్జున 'టాప్ 5 ఎవరో చెప్పమని అడగ్గా'.. 'బయలుదేరండి బాయ్ బాయ్' అంటూ చెప్పాడు శివబాలాజీ. ఆ తరువాత సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ను స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. వెంటనే సిరి వెక్కి వెక్కి ఏడ్చేసింది. 'సిరి వదిలేస్తున్నావా' అని శ్రీహాన్ అడగడంతో ఆమె మరింత ఎమోషనల్ అయిపోయింది.
Weekend is here...More family members on the stage #BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/Wp3ayU5TV8
— starmaa (@StarMaa) November 27, 2021
Also Read:సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్.. హౌస్ లో హాట్ డిస్కషన్..
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మరణించే వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు - రాజమౌళి
Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion