Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Champions Trophy 2025 Schedule:ఫిబ్రవరిలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ విడుదలైంది. వన్డే ర్యాకింగ్స్‌లో టాప్ 8లో ఉన్న ఎనిమిది జట్లు ఈ ట్రోఫీలో తలపడనున్నాయి.
ICC Champions Trophy 2025 Full Schedule: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. టోర్నీలో తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరగనుంది. ఈ మ్యాచ్ కూడా దుబాయ్‌లో ఉంటుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ కోసం యూఏఈని ఎంచుకుంది. అందువల్ల, భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను యుఎఇలో ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో జరగనుంది. కానీ భారత జట్టు ఫైనల్ చేరితే మాత్రం దుబాయ్‌లో జరుగుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ఆడనున్నాయి. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 19న కరాచీలో జరగనుంది. ఆ తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 20న ఆడనున్నారు. ఆఫ్ఘనిస్థాన్ తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో కరాచీలో జరగనుంది. ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ ఉంది.
భారత్ మ్యాచ్‌లు ఎప్పుడు ఎక్కడ
టీమిండియా తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో డీ కొట్టనుంది. ఆ తర్వాత పాకిస్థాన్‌తో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. మార్చి 2న భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఉంటుంది. టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.
ఫైనల్ లాహోర్‌లో
ఫైనల్ మ్యాచ్ మార్చి 9న లాహోర్‌లో జరగనుంది. కానీ టీమ్ ఇండియా ఫైనల్ చేరితే మాత్రం వెన్యూ దుబాయ్‌కు మారనుంది. టోర్నీ తొలి సెమీఫైనల్ దుబాయ్ వేదికగా జరగనుంది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో ఉంటుంది. టీమిండియా లేదా పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుకున్న తర్వాత వేదిక మారవచ్చు.
- ICC Men's Champions Trophy 2025 పూర్తి స్థాయి షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 19 - పాకిస్థాన్ v న్యూజిలాండ్, నేషనల్ స్టేడియం, కరాచీ
- ఫిబ్రవరి 20 - బంగ్లాదేశ్ v ఇండియా, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
- ఫిబ్రవరి 21 - ఆఫ్ఘనిస్తాన్ v సౌతాఫ్రికా, నేషనల్ స్టేడియం, కరాచీ
- ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్, గడాఫీ స్టేడియం, లాహోర్
- ఫిబ్రవరి 23 - పాకిస్థాన్ వర్సెస్ ఇండియా, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
- ఫిబ్రవరి 24 - బంగ్లాదేశ్ v న్యూజిలాండ్, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
- ఫిబ్రవరి 25 - ఆస్ట్రేలియా v సౌతాఫ్రికా, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
- ఫిబ్రవరి 26 - ఆఫ్ఘనిస్తాన్ v ఇంగ్లాండ్, గడాఫీ స్టేడియం, లాహోర్
- ఫిబ్రవరి 27 - పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
- ఫిబ్రవరి 28 - ఆఫ్ఘనిస్తాన్ v ఆస్ట్రేలియా, గడాఫీ స్టేడియం, లాహోర్
- మార్చి 1 - దక్షిణాఫ్రికా v ఇంగ్లాండ్, నేషనల్ స్టేడియం, కరాచీ
- మార్చి 2 - న్యూజిలాండ్ v భారత్, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
సెమీ ఫైనల్ ఫైనల్ మ్యాచ్‌లు ఎక్కడ?
- మార్చి 4 - సెమీ-ఫైనల్ 1, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
- మార్చి 5 - సెమీ-ఫైనల్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్
- మార్చి 9 - ఫైనల్ - గడ్డాఫీ స్టేడియం, లాహోర్ (టీమ్ ఇండియా ఫైనల్ చేరితే, వేదిక దుబాయ్)