Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Rupee Fall: రూపాయి విలువ మరింత పతనం అయింది. గతంలో జూహిచావ్లా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
Juhi Chawla: హమ్మయ్య నాది డాలర్ అండర్‌వేర్.. అదే రూపీ అయితే ఎప్పటికప్పుడు జారిపోయేదేమో? అని 2013లో హీరోయిన్ జూహీచావ్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింతగా రూపాయి బలహీనపడింది. మంగళవారం అది మరింతగా పడిపోయి 85 రూపాయలు దాటిపోయింది. అప్పట్లో ఆమె కామెంట్స్ చేసినప్పుడు అరవై రూపాయలకు కాస్త అటూ ఇటూగానే ఉండేది. అయితే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ చేతకావడం లేదని సినీ ప్రముఖులు ఇష్టా రీతిన విమర్శుల చేశారు. రూపాయి పడిపోయినప్పుడు జూహీచావ్లా కూడా ఇలా తన అండర్ వేర్ కంపెనీకి ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడంతో వైరల్ అయిపోయింది.
"Thank God my underwear is Dollar. If it were a rupee, it would keep falling again and again"
— 🚨Indian Gems (@IndianGems_) November 11, 2024
- Juhi Chawla in 2013 🔥🔥 pic.twitter.com/ELWLUN9M4E
అప్పట్లో అంటే 2013లో ఎన్నికల వేడి ప్రారంభమైన సమయంలో ఇలా రూపాయి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యేవి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ .. రూపాయి బలహీనపడటం.. మన్మోహన్ చేతకాని తనంగా చెప్పవారు. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
USDINR @ 84.5 @iam_juhi
— 𝓟𝓻𝓪𝓭𝓮𝓮𝓹 𝓑𝓱𝓪𝓰𝓮𝓻𝓲𝓪 🇮🇳 😎 (@BhageriaPradeep) November 10, 2024
Haven't you tied Rakhi. 🪅 pic.twitter.com/k3larqcEoz
Rupee falls 12 paise to all-time low of 85.06 against US dollar in early trade 🤬🤬
— Anshika Singh Yadav (@Anshika_in) December 24, 2024
Now it seems that the rupee has become the biggest currency in the world 😷 pic.twitter.com/Ffqu6nVIdc
అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ నేతలు రూపాయి పతనాన్ని భిన్నంగా సమర్థించుకుంటున్నారు. ఇలా వారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
Rupee(₹)is falling Because of Gravity.Gravity is attracting 18%GST also. It's not #TaxTerrorism it's Gravity Terrorism Don't blame #NirmalaSitharaman Tai for it!! #GST #TaxLoot pic.twitter.com/zFmEJRcEb5
— Neha (@NehaSinghz) December 23, 2024
Today andh bhakts explaining how Falling of Indian Rupee against US Dollar is good for India, by applying their Extra 2AB logic
— Veena Jain (@DrJain21) December 19, 2024
But they are the same, one who used to Criticize Manmohan Singh for the same reason then 🤪#stockmarketcrash pic.twitter.com/g2a85wFxbp
మొత్తంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రూపాయి పతనం మాత్రం ఆగదని స్పష్టమయింది. కానీ రాజకీయ విమర్శలు మాత్రం.. కొత్తవి .. పాతవి..కలిసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.