X

Salman Khan: అభిమానులూ... అలా చెయ్యొద్దు! - సల్మాన్ రిక్వెస్ట్

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'అంతిమ్: ద ఫైనల్ ట్రూత్' ఈ నెల 26న విడుదల అయ్యింది. ఓ థియేటర్‌లో అభిమానులు చేసిన పనికి... అలా చెయ్యొద్దని సల్మాన్ ఖాన్ అందర్నీ రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. 

FOLLOW US: 

స్టార్ హీరో సినిమా విడుదల అయ్యిందంటే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి ఒక రేంజ్‌లో ఉంటుంది. షో స్టార్ట్ అయ్యే ముందు థియేటర్ బయట క్రాకర్స్ కాలుస్తారు. బ్యాండ్ బాజా అరేంజ్ చేస్తారు. డ్యాన్సులు వేస్తారు. ఆ హంగామా అంతా ఇంతా కాదు. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన 'అంతిమ్ : ద ఫైనల్ ట్రూత్' (Antim: The Final Truth)సినిమా విడుదల అయ్యింది. ఉత్తరాదిన చాలా థియేటర్లలో సందడి సందడి నెలకొంది. అయితే, ఓ థియేటర్‌లో అభిమానులు మాత్రం ఓ అడుగు ముందుకు వేశారు. థియేటర్‌ లోపల క్రాకర్స్ (బాణా సంచా) కాల్చారు. ఆ విజువల్స్ సల్మాన్ ఖాన్ దృష్టికి వచ్చాయి. దాంతో అలా చెయ్యవద్దని ఆయన అభిమానులను రిక్వెస్ట్ చేశారు. థియేటర్ యాజనమాన్యాలను సైతం లోపలకు క్రాకర్స్ అనుమతించవద్దని కోరారు.

"ఆడిటోరియం (థియేటర్) లోపల క్రాకర్స్ కాల్చవద్దని నా అభిమానులు అందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా చేయడం వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. అప్పుడు మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. సినిమా హాలు లోపలకు ఫైర్ క్రాకర్స్ తీసుకు వెళ్లడానికి అనుమతించవద్దని, సెక్యూరిటీ వారు ఎంట్రీ పాయింట్ వద్ద లోపలకు తీసుకు వెళ్లకుండా ఆపాలని థియేటర్ యజమానులకు నా విన్నపం. సినిమాను అన్ని విధాలుగా ఆస్వాదించండి. కానీ, దయచేసి ఈ విధం (క్రాకర్స్ కాల్చడం వంటివి) చేయవద్దు. నా అభిమానులు అందరికీ ఇది రిక్వెస్ట్. థాంక్యూ" అని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

View this post on Instagram
 
A post shared by Salman Khan (@beingsalmankhan)

సల్మాన్, అతని బావ ఆయుష్ శర్మ నటించిన ఈ 'అంతిమ్ : ద ఫైనల్ ట్రూత్'కు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు.Also Read: ఆపవేరా? ఆదుకోరా? లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా? - దేవుడికి ప్రశ్నలు సంధించిన పాట
Also Read: ప్రభాస్ కొడితే 100మంది పడటం చూశాం! ప్రేమిస్తే ఎంత మంది పడతారో చూద్దాం!
Also Read: అనసూయ అడగాలే కానీ... లిప్ లాక్‌కు కూడా 'హైప‌ర్' ఆది రెడీ!?
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
Also Read: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!
Also Read: టాలీవుడ్‌లో విషాదం... ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీను వైట్లకు పితృవియోగం
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: bollywood salman khan సల్మాన్ ఖాన్ Antim: The Final Truth Fans Burst Crackers Inside Theatre

సంబంధిత కథనాలు

Balakrishna: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..

Balakrishna: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..

Jayamma: 'జయమ్మ.. చూసే జనం కళ్లకి సూర్యకాంతమ్మ..' ర్యాప్ పాడిన సుమ..

Jayamma: 'జయమ్మ.. చూసే జనం కళ్లకి సూర్యకాంతమ్మ..' ర్యాప్ పాడిన సుమ..

NagaChaitanya: బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆమెతోనే.. సమంతపై చైతు కామెంట్స్..

NagaChaitanya: బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆమెతోనే.. సమంతపై చైతు కామెంట్స్..

Lata Mangeshkar Health: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. లేటెస్ట్ హెల్త్ అప్డేట్..

Lata Mangeshkar Health: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. లేటెస్ట్ హెల్త్ అప్డేట్..

Acharya: 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్.. అనౌన్స్మెంట్ వచ్చేసింది..

Acharya: 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్.. అనౌన్స్మెంట్ వచ్చేసింది..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Osmania University: ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం

Osmania University: ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం

KTR Tweet: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..

KTR Tweet: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..

Samantha Photos: సమంత క్యూట్ స్మైల్.. అభిమానులు ఫిదా..

Samantha Photos: సమంత క్యూట్ స్మైల్.. అభిమానులు ఫిదా..

1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి

1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి