Akhanda: బాలకృష్ణ అభిమానులకు బంపర్ న్యూస్... బెనిఫిట్ షోస్‌కు అంతా రెడీ!
నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు బంపర్ న్యూస్... భాగ్య నగరంలో బెనిఫిట్ షోస్ వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అంతా రెడీ అయినట్టే.
నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'అఖండ' సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. 'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటించిన హ్యాట్రిక్ సినిమా కావడం... ఆల్రెడీ విడుదల అయిన ట్రైలర్లు, పాటలు సినిమా మీద అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో నందమూరి, బాలకృష్ణ అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్‌లోని అటువంటి అభిమానులకు ఓ బంపర్ న్యూస్.
డిసెంబర్ 2వ తేదీ తెల్లవారుజామున బెనిఫిట్ షోస్ వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పోలీసుల నుంచి అనుమతులు తీసుకోనున్నారు. ఆల్మోస్ట్ అంతా రెడీ అయినట్టే. అనుమతులు లభిస్తే... ఉదయం నాలుగు గంటలకు బెనిఫిట్ షోస్ వేయాలని ఆలోచిస్తున్నారు. భ్రమరాంబ, మల్లిఖార్జున థియేటర్లలో బెనిఫిట్ షోస్ పడే అవకాశాలు ఉన్నాయి. గతంలోనూ ఆ థియేటర్లలో బాలకృష్ణ సినిమాలు బెనిఫిట్ షోస్ వేశారు. బాలకృష్ణ సినిమా విడుదల అంటే ఏపీలోనూ అభిమానుల హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. అక్కడ కూడా పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోస్ పడేవి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా అక్కడ బెనిఫిట్ షోస్ వేసే వీలు లేకుండా పోయింది.
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన 'అఖండ'లో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించారు. ప్రతినాయకుడి పాత్రలో శ్రీకాంత్, కీలక పాత్రల్లో పూర్ణ, జగపతి బాబు తదితరులు నటించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అద్భుత స్పందన లభించిన నేపథ్యంలో ప్రేక్షకులు, అభిమానులకు ద్వారకా క్రియేషన్స్ థాంక్స్ చెప్పింది.
A personal note to all the fans for your overwhelming response at #AkhandaPreReleaseEvent 🙏 🔥.
— Dwaraka Creations (@dwarakacreation) November 28, 2021
Get ready for #Akhanda’s Mass Jathara!!
Thank you,
Regards,#MiryalaRavinderReddy pic.twitter.com/EYRBfvP5Hz
Also Read: సైలెంట్‌గా ఫ్యాన్స్‌కు క్లాస్ పీకుతున్న సల్మాన్ ఖాన్... మిగతా స్టార్స్ ఏం చేస్తారో?
Also Read: బాల్ తగిలితే... ఆ దెబ్బకు పాతిక కుట్లు పడ్డాయి. నార్మల్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది!
Also Read: ఆపవేరా? ఆదుకోరా? లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా? - దేవుడికి ప్రశ్నలు సంధించిన పాట
Also Read: ప్రభాస్ కొడితే 100మంది పడటం చూశాం! ప్రేమిస్తే ఎంత మంది పడతారో చూద్దాం!
Also Read: అనసూయ అడగాలే కానీ... లిప్ లాక్‌కు కూడా 'హైపర్' ఆది రెడీ!?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి