Farmers Lock Officials in Rythu Vedika | Urea Shortage | అధికారులను బంధించిన రైతులు
యూరియా కొరత రైతులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచే సహకార సంఘాల వద్దకు చేరుకొని పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లనో చెప్పులు, ఆధార్ కార్డులు పెడుతున్నారు. మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది కానీ రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేఫధ్యంలో సిద్దిపేట జిల్లాలో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు వింత రీతిలో తమ కోపాన్ని అధికారులపై చూపించారు. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో సరిపడ యూరియా ఇవ్వడంలేదని అధికారులను రైతు వేదికలో బంధించి తాళం వేశారు రైతులు. రెండు లారీల యూరియాను అధికారులు పంపిణీ చేసారు, కానీ ఇంకా కొంతమంది రైతులకు యూరియా తక్కువ అవ్వటంతో రైతులు వ్యవసాయ అధికారులను రైతు వేదిక భవనంలో బంధించి తాళం వేసారు. దాంతో రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యూరియాను తెప్పించి ఇస్తాం అని హామీ ఇవ్వడంతో అధికారులు బయటకు వదిలేసారు.





















