ABD on Iyer in Asia Cup 2025 | అయ్యర్‌ని సెలక్ట్ చేయకపోవడంపై డివిలియర్స్
ఆసియా కప్ 2025 ఆడబోతున్న టీమిండియా స్క్వాడ్‌లోకి శ్రేయస్ అయ్యర్‌ని సెలక్ట్ చేయకపోవడంపై ఆల్రెడీ ఫ్యాన్స్ అంతా బీసీసీఐ అండ్ సెలక్షన్ కమిటీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. కావాలనే అయ్యర్‌ని టీమ్‌లోకి తీసుకోలేదంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక టీమ్‌లో అయ్యర్‌కి సరిపోయే ప్లేస్ ఖాళీగా లేదంటూ చీఫ్ సెలక్టర్ అగార్కర్ అనడం ఫ్యాన్స్‌కి ఇంకా చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఇదంతా చూసి.. డైవర్షన్ డ్రామానో లేదంటే నిజంగానే ఫ్యూచర్ ప్లానింగో కానీ.. బీసీసీఐ అయ్యర్‌ని టీమిండియా వన్డే కెప్టెన్ చేయాలనుకుంటోందంటూ న్యూస్ బయటకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ కొంచెం కూల్ అయినట్లు కనిపిస్తున్న టైంలో.. సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్.. ఆరిపోతున్న నిప్పులో మళ్లీ పెట్రోల్ పోసినంత పని చేశాడు. రీసెంట్‌గా ఓ ట్విటర్ లైవ్ చాట్‌లో మాట్లాడిన డివిలియర్స్.. ‘ఆసియా కప్ 2025కి శ్రేయస్ సెలక్ట్ కాకపోవడం వెనుక సీక్రెట్ ఉన్నట్లే ఉంది. అయినా క్లోజ్డ్ డోర్స్ వెనుక ఏం జరిగిందో ఎవరికి తెలుస్తుంది? ఎవరికీ తెలీదు. మీకూ తెలీదు. నాకూ తెలీదు. కానీ నేనైతే చాలా షాకయ్యా. అయితే.. ఒకవేళ నేనే టీమ్ సెలక్టర్ అయితే.. ఓ టీమ్‌లో ప్లేయర్లని సెలక్ట్ చేసేటప్పుడు ఆ ప్లేయర్ గ్రౌండ్‌లో ఆటతీరుపైనే కాకుండా.. డ్రెస్సింగ్ రూంల్ ఎలా ఉంటాడు? మిగిలిన ప్లేయర్లతో ఫ్రెండ్లీగా ఉంటాడా..? లేదంటే ఈగోయిస్టిక్‌గా బిహేవ్ చేస్తాడా..? అనేది కూడా చూస్తా. ఈగోయిస్టిక్ ప్లేయర్లని పక్కనపెట్టి.. ఫ్రెండ్లీ ప్లేయర్లని మాత్రమే సెలక్ట్ చేస్తా. అంటే ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కన్‌సిడర్ చేయకుండా.. టీమ్ ప్లేయర్‌గా ఆడగలడా? అనేదే చూస్తాను. ఒకవేళ టీమిండియా సెలక్షన్‌లో ఇలాంటిదేదైనా కారణం ఉండొచ్చు. అయితే ఇదంతా నా అంచనా మాత్రమే. ఇంకో విషయం ఏంటంటే.. అయ్యర్ ఈ మధ్య ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా ఆడాడు. కెప్టెన్సీలో కూడా ఇరగదీశాడు. అయితే టీమ్‌లో ఎక్కువ మంది కెప్టెన్లుంటే ఈగో క్లాషెస్ వస్తాయనే అయ్యర్‌ని పక్కన పెట్టి ఉండొచ్చు.’ అన్నాడు డివిలియర్స్. డివిలియర్స్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఈ కామెంట్స్‌పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.





















