అన్వేషించండి

IADWS: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన IADWS ప్రయోగం సక్సెస్​

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్​ అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) మొట్టమొదటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.

దేశ డిఫెన్స్​ వ్యవస్థలో మరో మైలు రాయి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్​ అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) మొట్టమొదటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 23న మధ్యాహ్నం 12:30 గంటలకు ఒడిశా తీరంలో మిస్సైల్​ పరీక్షలు చేపట్టగా విజయవంతమయ్యాయి. ఇది దేశం యొక్క స్వావలంబన సైనిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో కీలక పరిణామంగా నిలవనుంది.

కొనియాడిన DRDO
విజయవంతమైన ట్రయల్ వీడియోను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) Xలో షేర్ చేసింది. ‘స్వదేశీ క్విక్ రియాక్షన్ సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్స్​ (QRSAM), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) మిస్సైల్స్​, హైపవర్​  లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (DEW)లను అనుసంధానించే బహుళ-లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సొల్యూషన్​’గా IADWSను అభివర్ణించింది.

DRDO సైతం ట్రయల్స్​ వీడియోలను Xలో షేర్​ చేసింది. ‘ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) తొలి మిస్సైల్​ పరీక్షలు 23 ఆగస్టు 2025న ఒడిశా తీరంలో 12:30 గంటల సమయంలో విజయవంతంగా హిర్వహించారు’ అని పేర్కొంది.

మల్టీ లేయర్డ్​ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
IADWS అనేది అన్ని స్వదేశీ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (QRSAM), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) క్షిపణులు, హై పవర్ లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (DEW)లను కలిగి ఉన్న మల్టీ లేయర్డ్​ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.

ప్రశంసించిన రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​
ఈ విజయాన్ని ప్రశంసిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  Xలో కొనియాడారు. ‘DRDO ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ యొక్క తొలి క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. QRSAM, VSHORADS, అధిక సామర్థ్యం గల DEW లతో కూడిన IADWS ఓ ప్రత్యేకమైన వాయు రక్షణ వ్యవస్థ. ఈ అద్భుతమైన విజయానికి DRDO, భారత సాయుధ దళాలు, డిఫెన్స్​ ఇండస్ట్రీని అభినందిస్తున్నా. ఈ టెస్ట్​ మన వాయు-రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది.

హై-స్పీడ్ మిస్సైల్స్​ను నిర్వీర్యం చేయగల సామర్థ్యం
అత్యాధునిక స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి మల్టీ లేయర్డ్​ వైమానిక కవచంగా రూపొందించిందే IADWS. ముప్పులను QRSAM, VSHORADS క్షిపణులు అడ్డుకుంటాయి. అయితే అధిక-శక్తి లేజర్ DEW డ్రోన్‌లు, క్షిపణులు, హై-స్పీడ్ మిస్సైల్స్​ను నిర్వీర్యం చేయగల సామర్థ్యం కలవి. ఈ వ్యవస్థలు దేశానికి మరింత భద్రతను కల్పించనున్నాయి.

ఈ పరీక్ష ఓ మైలురాయి..
దేశ రక్షణ స్వావలంబనకు ముందుకు సాగడంలో విజయవంతమైన ఈ పరీక్ష ఓ మైలురాయి అని అధికారులు అభివర్ణించారు. సమగ్ర మల్టీ లేయర్​ వైమానిక రక్షణ వ్యవస్థను ప్రదర్శించడం ద్వారా, దేశం కీలకమైన మౌలిక సదుపాయాలను కాపాడుకునేలా, వైమానిక ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంది అని పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget