Mukesh Ambani Car Collection: రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు.. ముఖేష్ అంబానీ గ్యారేజ్‌లో ప్రపంచంలోని టాప్ లగ్జరీ కార్లు
Most Expensive Cars in India | భారతదేశ కుబేరుడు ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం వద్ద మంచి లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. వారి గ్యారేజీలో రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు టాప్ కార్లు ఉన్నాయి.

Ambani Car Collection | ముంబై: భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఒకరు. దేశంలో అత్యంత ఖరీదైన కారు ఓనర్ నీతా అంబానీ అని, ఆమె వద్ద రూ.100 కోట్ల విలువైన కారు ఉందని ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అంబానీ కుటుంబం కార్ల కలెక్షన్ హాట్ టాపిక్ అవుతుంది. అంబానీల గ్యారేజీలో 170 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నాయి, వాటి ధరలు చాలా వరకు కోట్ల రూపాయలలో ఉన్నాయి. అంబానీ కుటుంబం గ్యారేజీలో రోల్స్ రాయిస్, మెర్సిడెస్, ఫెరారీ వంటి అత్యంత ఖరీదైన బ్రాండ్ల కార్లు ఉన్నాయి.
రోల్స్ రాయిస్ కల్లినన్ బుల్లెట్ ప్రూఫ్
అంబానీ కుటుంబానికి చెందిన అత్యంత ఖరీదైన కారు నీతా అంబానీ వద్ద ఉంది. దేశంలోనే అత్యంత ఖరీదైన కారు Audi A9 Chameleon విలువ రూ.100 కోట్లు పైమాటే. ముఖేష్ అంబానీ వద్ద అత్యంత ఖరీదైన కారు బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్, దీని ధర దాదాపు రూ. 17 కోట్లు. ఇది ప్రత్యేకంగా సేఫ్టీ కోసం వినియోగిస్తారు. ఈ లగ్జరీ SUV ని కుటుంబ సభ్యుల హై-ప్రొఫైల్ లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా రూపొందించారు. దాంతోపాటు ఈ కారు అత్యాధునిక భద్రతా లక్షణాలను కలిగి ఉంది.
మెర్సిడెస్ బెంజ్ S 680 గార్డ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్
అంబానీ కుటుంబం గ్యారేజీలో మెర్సిడెస్ కంపెనీ కార్లు చాలానే ఉన్నాయి. అయితే అందులో మెర్సిడెస్ బెంజ్ S 680 గార్డ్ చాలా ప్రత్యేకమైనది. ఇది కూడా బుల్లెట్ ప్రూఫ్ లగ్జరీ సెడాన్, దీని ధర దాదాపు రూ.15 కోట్లు ఉంటుంది. నీతా అంబానీకి ఇష్టమైన కారు రోల్స్ రాయిస్ ఫాంటమ్ EWB కారు. ఇది ఎక్స్‌టెండెడ్ వీల్బేస్ మోడల్. ప్రత్యేకమైన రంగుతో వస్తుంది. దీని విలువ రూ. 14 కోట్ల రూపాయలు.
ఆకాష్ అంబానీ ఫెరారీ
ముఖేష్ అంబానీ కుమారుడు, సంస్థ డైరెక్టర్లలో ఒకరైన ఆకాష్ అంబానీ ఫెరారీ కంపెనీ మొదటి SUV, పురోసాంగ్వేతో తరచుగా ముంబై వీధుల్లో ప్రయాణిస్తారు. ఈ లగ్జరీ కారు ధర రూ.12 కోట్లకు పైగా ఉంది.
అనంత అంబానీ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీకి రోల్స్ రాయిస్ SUVలు అంటే చాలా ఇష్టం. అనంత్ అంబానీ వద్ద 2024 రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారు ఉంది. దీని ధర దాదాపు 14 కోట్ల రూపాయలు. ఈ కారు లగ్జరీగా కనిపిస్తుంది. ఫీచర్లతో పాటు సేఫ్టీకి అంబానీ ఫ్యామిలీ ప్రాధాన్యం ఇస్తుందని తెలిసిందే. దీనితో పాటు అంబానీ కుటుంబం వద్ద మరో రోల్స్ రాయిస్ కల్లినన్ ఉంది. ఈ కారు ధర 13 నుండి 14 కోట్ల రూపాయలు ఉంటుంది. అంబానీ కుటుంబం జీవనశైలి, లగ్జరీ కార్ల పట్ల వారికున్న అభిరుచి వారి కార్ కలెక్షన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. వారి గ్యారేజీలోని ప్రతి కారు కోట్ల రూపాయల్లో ఉంటుంది. బయట ప్రయాణాలకు కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్, హై-టెక్ ఫీచర్లు ఉన్న కార్లు వినియోగిస్తారు.






















