Tata Nexon EV Discount: టాటా కర్వ్, హారియర్, టియాగోలపై భారీ డిస్కౌంట్.. రూ.2 లక్షల వరకు బెనిఫిట్స్
Tata Harrier EV Discount | టాటా మోటార్స్ ఓనం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లపై డిస్కౌంట్ ధరలకు విక్రయాలు చేస్తోంది.

Tata Motors Discount | ఓనం పండుగ సందర్భంగా తమ కస్టమర్ల కోసం టాటా మోటార్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇటీవల విడుదలైన Tata Harrier EVపై కంపెనీ రూ. 1 లక్షల తగ్గింపును ప్రకటించింది. కానీ ఈ ఫెస్టివ్ ఆఫర్ టాటా కంపెనీ EV లను ఇప్పటికే వినియోగిస్తున్న కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పుడు Harrier EVకి అప్‌గ్రేడ్ చేస్తోంది.
Tata కంపెనీ ఇతర EVలపై ఆఫర్లు
టాటా SUV బుకింగ్‌ను కేరళలోని డీలర్‌షిప్‌లలో డిస్కౌంట్ ద్వారా పొందవచ్చు. Tata Harrier EV కంపెనీ కొత్త ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్ చేశారు. ఇందులో 60+ kWh బ్యాటరీ, డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్, ADAS ఫీచర్‌తో పాటు V2L సపోర్ట్ వంటి ఫీచర్ ఉంది. టాటా హారియర్ ఈవీ ధర రూ. 27.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. తాజాగా ప్రకటించిన డిస్కౌంట్ తర్వాత ఈ ధర రూ. 26.99 లక్షలకు విక్రయాలు జరుగుతున్నాయి. Harrier EVతో పాటు, టాటా మోటార్స్ తన మొత్తం EV వాహనాలపై సైతం ఓనం ఆఫర్లు ప్రకటించింది.
Tata Nexon EV పై రూ. 1.3 లక్షల వరకు బెనిఫిట్
టాటా Nexon ev కస్టమర్‌లు కొనుగోలుపై రూ. 1.3 లక్షల వరకు ప్రయోజనం పొందుతారు. ఇందులో రూ. 50,000 కన్స్యూమర్ ప్లాన్, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ సహా రూ. 30,000 అడిషనల్ వారంటీ ఉన్నాయి.
Tata Tiago EV పై రూ. 85,000 వరకు ప్రయోజనం
టాటా టియాగో ఈవీ కొనుగోలుదారులకు రూ. 85,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్ (Exchange bonus), వారంటీ పొడిగింపు లాంటి ఆఫర్లు ఉన్నాయి. ఈ కారు నగరంలో రోజువారీ జర్నీకి కస్టమర్‌ల బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది.
Tata Punch EV పై రూ. 10,000 ఆఫర్
ఇటీవల విడుదలైన Tata Punch EV పై రూ. 10,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఎంట్రీ-లెవెల్ EV ఇప్పటికే ఆకర్షణీయమైన ధరతో ఉండగా.. ఇప్పుడు ఓనం ఆఫర్ దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తుంది.
పెట్రోల్, డీజిల్ మోడళ్లపై సైతం డిస్కౌంట్
ఓనం ఆఫర్ ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే పరిమితం కాలేదు. టాటా పలు ICE (Internal Combustion Engine) మోడళ్లపై కూడా ఆఫర్లను ప్రకటించింది.
- టాటా Harrier డీజిల్ పై రూ. 1.4 లక్షల వరకు బెనిఫిట్
- టాటా Safari డీజిల్ పై రూ. 1.25 లక్షల వరకు ప్రయోజనం
- టాటా Altroz (పెట్రోల్/డీజిల్) పై రూ. 45,000 వరకు తగ్గింపు
- టాటా Tigor (పెట్రోల్) పై రూ. 45,000 వరకు ఆఫర్
- Tata Tiago (పెట్రోల్) పై రూ. 35,000 వరకు బెనిఫిట్
ఈ ఆఫర్‌లన్నీ సెలక్టెట్ వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తాయని, వాహనాల స్టాక్ లభ్యతపై ఆధారపడి ఉంటాయని సంస్థ తెలిపింది. ఈసారి టాటా కేవలం EV కస్టమర్‌లతో పాటు ICE కార్లపై తగ్గింపులను ప్రకటించి పండుగ సీజన్‌లో విక్రయాలను పెంచడానికి ప్లాన్ చేసింది. ఈవీ వాహనాలు కొనాలనుకునేవారు ముందు కార్లకు సంబంధించి పూర్తి వివరాలు, ఇంజిన్, ఫీచర్లు, మైలేజీ ఆఫర్లు తెలుసుకున్నాకే వాటిని బుక్ చేసుకోవడం బెటర్.






















