Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?
నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న 'బింబిసార' టీజర్‌ను ఈ రోజు విడుదల చేశారు. టీజర్ ఎలా ఉంది? మీరే చూడండి.
![Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా? Nandamuri Kalyan Ram's mythological movie Bimbisara Teaser is out now Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/29/4470666dc3a19a0785d7ed0e0c66dc23_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె నిర్మిస్తున్న సినిమా 'బింబిసార. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోగా కల్యాణ్ రామ్ 18వ చిత్రమిది. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.
'ఓ సమూహాం తాలూకూ ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే... కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలు అయితే... ఇందరి భయాన్ని చూస్తూ... పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం' అంటూ నేపథ్యంలో ఓ వాయిస్ వినిపించిన తర్వాత బింబిసారుడిగా కల్యాణ్ రామ్‌ను పరిచయం చేశారు. కదన రంగంలో కత్తి దూసిన కల్యాణ్ రామ్ వీరోచితంగా కనిపించారు. యుద్ధ సన్నివేశాలు భారీ స్థాయిలో తీసినట్టు కనిపిస్తోంది. రాజుగా, ఈ జనరేషన్ యువకుడిగా... రెండు పాత్రల్లో కల్యాణ్ రామ్‌ను చూపించారు. టీజర్ అంతా యాక్షన్ మోడ్‌లో సాగింది. విజువల్ గ్రాండియర్‌తో పాటు సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం టీజర్‌కు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాయి. ఇందులో కొత్త కల్యాణ్ రామ్ కనిపించారు.
'A Time Travel From Evil To Good'#BimbisaraTeaser out now!
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 29, 2021
▶️ https://t.co/OsGqgXfL6t#Bimbisara@DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @Music_Santhosh @ChirantannBhatt @anilpaduri @NTRArtsOfficial pic.twitter.com/gWNlQA5aAA
'బింబిసార' ఫస్ట్ లుక్ విడుదల అయినప్పుడు కల్యాణ్ రామ్ లుక్ కొత్తగా ఉందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అప్పుడు క్రూరుడైన బింబిసారుడి లుక్‌లో.... కదన రంగంలో శత్రు సైనికులను చంపి, వారి శవాలపై ఠీవిగా కూర్చున్న కథానాయకుడి లుక్ విడుదల చేశారు. ఇప్పుడు టీజర్‌కు కూడా మంచి స్పందన లభిస్తోందని యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మైథిలాజికల్ పాత్రలో కల్యాణ్ రామ్ కనిపించడం ఇదే తొలిసారి. భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్, వరీనా హుస్సేన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి పాటలు రాస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.
BIMBISĀRA Teaser:
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక... సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
Also Read: సైలెంట్‌గా ఫ్యాన్స్‌కు క్లాస్ పీకుతున్న సల్మాన్ ఖాన్... మిగతా స్టార్స్ ఏం చేస్తారో?
Also Read: బాల్ తగిలితే... ఆ దెబ్బకు పాతిక కుట్లు పడ్డాయి. నార్మల్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది!
Also Read: ఆపవేరా? ఆదుకోరా? లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా? - దేవుడికి ప్రశ్నలు సంధించిన పాట
Also Read: బాలకృష్ణ అభిమానులకు బంపర్ న్యూస్... బెనిఫిట్ షోస్‌కు అంతా రెడీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)