Samantha: పుష్ప సెట్‌కు వచ్చిన సమంత... అల్లు అర్జున్‌తో స్పెషల్ సాంగ్ షురూ!
'సన్నాఫ్ సత్యమూర్తి'లో అల్లు అర్జున్, సమంత జంటగా నటించారు. సినిమాలో పాటలకు స్టెప్పులు వేశారు. మళ్లీ ఓ పాటలో జంటగా స్టెప్పులు వేస్తున్నారు. అయితే, ఈసారి సమంత హీరోయిన్ కాదు!
![Samantha: పుష్ప సెట్‌కు వచ్చిన సమంత... అల్లు అర్జున్‌తో స్పెషల్ సాంగ్ షురూ! Samantha joins Pushpa: The Rise sets and special song in the film shoot starts today Samantha: పుష్ప సెట్‌కు వచ్చిన సమంత... అల్లు అర్జున్‌తో స్పెషల్ సాంగ్ షురూ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/29/52720b0a4e1f28557097f74449a4a377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ సినిమా 'పుష్ప : ద రైజ్'. ఇందులో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు (సోమవారం, నవంబర్ 29) హైదరాబాద్‌లో ఆ సాంగ్ షూటింగ్ స్టార్ట్ చేశారు. పాట కోసమే ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. అందులో షూటింగ్ షురూ చేశారు. గతంలో 'సన్నాఫ్ సత్యమూర్తి'లో అల్లు అర్జున్, సమంత జంటగా నటించారు. అయితే, ఆ సినిమాలో సమంత హీరోయిన్. ఇప్పుడు ఆమెది స్పెషల్ అప్పియరెన్స్ మాత్రమే. సమంత చేస్తున్న తొలి స్పెషల్ సాంగ్ కూడా ఇదే. అందువల్ల, పాట మీద ఆల్రెడీ క్రేజ్ ఏర్పడింది. గణేష్ ఆచార్య ఈ పాటకు కోరియోగ్రఫీ అందిస్తున్నారు. ఆల్రెడీ 'పుష్ప'లో సాంగ్స్ చేశారాయన.
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో మూడో సినిమా ఇది. 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ అందించారట. సుకుమార్ సినిమా అంటే దేవి శ్రీ ప్రసాద్ ఎప్పుడూ బెస్ట్ ట్యూన్స్ ఇస్తారు. ఈసారి ఎటువంటి ట్యూన్ ఇచ్చారో చూడాలి.
అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో ధనుంజయ, కమెడియన్ కమ్ హీరో సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అందుకని, ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు. డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ఈ రోజు ప్రకటించారు.
The WILDEST MASS festival begins 💥#PushpaTrailer on DEC 6th 🔥#PushpaTheRise #ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/aNR2ljn17o
— Mythri Movie Makers (@MythriOfficial) November 29, 2021
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... గెస్ట్ కూడా! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
Also Read: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక... సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
Also Read: సైలెంట్‌గా ఫ్యాన్స్‌కు క్లాస్ పీకుతున్న సల్మాన్ ఖాన్... మిగతా స్టార్స్ ఏం చేస్తారో?
Also Read: బాల్ తగిలితే... ఆ దెబ్బకు పాతిక కుట్లు పడ్డాయి. నార్మల్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది!
Also Read: బాలకృష్ణ అభిమానులకు బంపర్ న్యూస్... బెనిఫిట్ షోస్‌కు అంతా రెడీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)