అన్వేషించండి

Pekamedalu Teaser : భూం భూం లచ్చన్న - 'బాహుబలి'లో సేతుపతి నిర్మించిన 'పేకమేడలు' టీజర్

Rakesh Varre as producer : 'బాహుబలి'లో సేతుపతిగా నటించిన రాకేష్ వర్రే నిర్మించిన తాజా సినిమా 'పేకమేడలు'. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ ఎలా ఉంది? ఆ లక్ష్మణ్ కథ ఏమిటి? 

'బాహుబలి'లో సేతుపతి పాత్రలో నటించిన రాకేష్ వర్రే (Rakesh Varre) గుర్తు ఉన్నారా? గుడిలో తన మీద చెయ్యి వేయబోతే అనుష్క వేళ్ళు నరికేస్తారు కదా! ఆ తర్వాత రాజదర్బార్ సన్నివేశంలో ప్రభాస్ చేతిలో శిక్షకు గురి అవుతారు. ఆ రాకేష్ వర్రీ. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఆ సినిమా టీజర్ విడుదలైంది. 

రాకేష్ వర్రే నిర్మాణంలో 'పేకమేడలు'
రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు. ఇంతకు ముందు 'ఎవ్వరికీ చెప్పొద్దు' నిర్మించారు. ఆ సినిమాలో ఆయనే హీరో. ఇప్పుడు రాకేష్ వర్రీ మరో సినిమా నిర్మించారు. అయితే... అందులో హీరో ఆయన కాదు. కొత్త హీరో హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తూ 'పేకమేడలు' సినిమా రూపొందిస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందుతోంది. ఈ రోజు 'పేకమేడలు' టీజర్ విడుదల చేశారు.  

Also Read : అనుష్క సినిమా వాయిదా - ప్రభాస్ కజిన్‌కు తిట్లు తప్పవా?

'నా పేరు శివ', 'అంధగారం' తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan)ను 'పేక మేడలు'తో హీరోగా పరిచయం అవుతున్నారు. ఆయన సరసన అనూష కృష్ణ నటిస్తున్నారు. ఆమెకూ తొలి తెలుగు చిత్రమిది. చిత్ర దర్శకుడు నీలగిరి మామిళ్ళకు సైతం ఇది మొదటి సినిమా. 'పేకమేడలు' టీజర్ ఎలా ఉంది? అనేది చూస్తే... 

భూం భూం లచ్చన్న... తప్పులు చేశాడా?
'పేకమేడలు' సినిమాలో లక్ష్మణ్ పాత్రలో వినోద్ కిషన్ కనిపించనున్నారు. కనీసం రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేని, పేద కుటుంబంలో జన్మించిన లక్ష్మణ్... తానొక పెద్ద వ్యాపారవేత్త అని ఫోజులు కొట్టడం టీజర్లో గమనించవచ్చు. కన్నతండ్రి చేతిలో సైతం దారుణమైన తిట్లు తింటూ ఉంటాడు. 'ఎదగడానికి ఏం చేసినా తప్పు లేదు' అని చెప్పే లక్ష్మణ్ ఏం చేశాడు? ఏమైంది? అనేది సినిమాలో చూడాలి. టీజర్ చివర్లో వచ్చే 'భూం భూం లచ్చన్న' నేపథ్య సంగీతం క్యాచీగా ఉంది. 

ఆగస్టులో 'పేక మేడలు' విడుదల 
Pekamedalu Movie Release Date : ఆగస్టులో 'పేక మేడలు' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు దర్శక - నిర్మాతలు తెలిపారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి కథతో సినిమా తీసినట్లు, సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని వారు పేర్కొన్నారు. ఇందులో 50 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నట్లు రాకేష్ వర్రే పేర్కొన్నారు.  

Also Read తెలుగులోకి తమన్నా ట్రెండింగ్ సాంగ్ - మాస్ & స్పైసీ గురూ!

వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్న 'పేక మెడలు' సినిమాకు సౌండ్ డిజైనర్ : రంగనాథ్ రేవి, సౌండ్ మిక్సింగ్ : కన్నన్ గన్ పత్, కూర్పు : సృజన అడుసుమిల్లి - హంజా అలీ, కాస్ట్యూమ్ డిజైనర్ : మేఘన శేషవపురి, స్క్రీన్ ప్లే : హంజా అలీ - శ్రీనివాస్ ఇట్టం - నీలగిరి మామిళ్ళ, మాటలు & పాటలు : భార్గవ కార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కేతన్ కుమార్, ఛాయాగ్రహణం : హరిచరణ్ కె, సంగీతం : స్మరన్, సహా నిర్మాత: వరుణ్ బోర, నిర్మాణ సంస్థ : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్, నిర్మాత : రాకేష్ వర్రే, రచన & దర్శకత్వం : నీలగిరి మామిళ్ళ.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget