అన్వేషించండి

Miss Shetty Mr Polishetty Movie : అనుష్క సినిమా వాయిదా - ప్రభాస్ కజిన్‌కు తిట్లు తప్పవా?

Miss Shetty Mr Polishetty Postponed : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ శెట్టి' వాయిదా పడిందని సమాచారం.

అగ్ర కథానాయిక అనుష్క శెట్టి (Anushka Shetty) సినిమా థియేటర్లలో వచ్చి ఐదు సంవత్సరాలు అవుతోంది. బ్లాక్ బస్టర్ 'భాగమతి' 2018లో వస్తే... ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్దం' ఓటీటీలో విడుదలైంది. మధ్యలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి'లో అతిథి పాత్రలో కనిపించారంతే! సో, అనుష్క సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు యువి క్రియేషన్స్ షాక్ ఇచ్చేలా ఉంది. 

అనుష్క సినిమా వాయిదా వేయక తప్పదు!
అనుష్క ప్రధాన పాత్రలో 'భాగమతి' వంటి హిట్ తర్వాత యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty Mr Polishetty Movie). 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' విజయాల తర్వాత యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటించిన సినిమా కూడా ఇదే. ఆగస్టు 4న సినిమా విడుదల చేయనున్నట్లు గతంలో వెల్లడించారు. లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ఏమిటంటే... ఈ సినిమా విడుదల వాయిదా పడిందని!

అనుష్క, నవీన్ పోలిశెట్టిల సినిమా విడుదల వాయిదా పడిందని, వాయిదా వేయక తప్పదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభాస్ సినిమాలను సైతం ముందుగా అనుకున్న సమయానికి విడుదల చేయని రికార్డ్ యువి క్రియేషన్స్ సంస్థకు ఉంది. టీజర్లు, సాంగ్స్ కూడా లేటుగా విడుదల చేశారు. ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్, సెటైర్లతో రెచ్చిపోయేవారు. తిట్టేవారు కూడా! యువి క్రియేషన్స్ అధినేతలలో ఒకరైన ప్రమోద్ స్వయానా ప్రభాస్ కజిన్. ఇప్పుడు ఆయన్ను అనుష్క అభిమానులు తిట్టే ప్రమాదం ఉంది. 

ఆగస్టు 18న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'?
Miss Shetty Mr Polishetty New Release Date : ఆగస్టు 4న కాకుండా ఆగస్టు 18న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఇంకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరగలేదని, చెన్నైలో ఫైనల్ మిక్సింగ్ వర్క్ ఏదో పెండింగ్ ఉందని తెలిసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు. నాలుగు భాషల్లో వాయిదా పడినట్లే.

Also Read అమెరికాలో చిరంజీవి కాలికి సర్జరీ - సమస్య ఏమిటంటే?    

నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క ఫేమస్ షెఫ్ పాత్రలో నటించిన ఈ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు .పి (Mahesh Babu P) దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి.

Also Read తెలుగులోకి తమన్నా ట్రెండింగ్ సాంగ్ - మాస్ & స్పైసీ గురూ!

'జీ' చేతికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'  
అనుష్క సినిమా శాటిలైట్ & డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ జీ చేతికి వెళ్లాయి. అవును... 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' డిజిటల్ రైట్స్‌ను 'జీ' గ్రూప్ కొనుకోలు చేసింది. సినిమా విడుదలైన కొన్ని రోజులకు 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు జీ గ్రూప్ ఛానళ్లలో టెలికాస్ట్ చేస్తారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget