పవన్ కళ్యాణ్, సాయి తేజ్‌ల 'బ్రో' ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ 100 కోట్లు టచ్ చేసింది. ఏరియాల వారీగా ఎన్ని కోట్లకు అమ్మారంటే... 

'బ్రో' నైజాం రైట్స్ రూ. 30 కోట్లకు అమ్మారు.

సీడెడ్ (రాయలసీమ) రైట్స్ రూ. 13.20 కోట్లకు ఇచ్చారు.

ఉత్తరాంధ్ర రైట్స్ రూ. 10 కోట్లు, తూర్పు గోదావరి రైట్స్ 6.50, పశ్చిమ గోదావరి రైట్స్ 5.50 కోట్లకు ఇచ్చారు.

కృష్ణా జిల్లా రైట్స్ రూ. 5. 20 కోట్లకు, నెల్లూరు రైట్స్ రూ. 3.50 కోట్లకు అమ్మారు.

ఏపీ, తెలంగాణ... రెండు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 80.90 కోట్లు వచ్చాయి.

ఓవర్సీస్ రైట్స్ ద్వారా 12 కోట్లు, కర్ణాటక & రెస్టాఫ్ ఇండియా రైట్స్ 5 కోట్లు వచ్చాయి.

'బ్రో' టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 98.30 కోట్లు వచ్చాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్ 98.30 కోట్లు. 'బ్రో' బ్రేక్ ఈవెన్ కావాలంటే ఆల్మోస్ట్ 100 కోట్లు కలెక్ట్ చేయాలి.

'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' కలెక్షన్స్ 100 కోట్లు కంటే ఎక్కువ. సో, 'బ్రో'కు 100 కోట్లు ఈజీ!