ప్రముఖ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటోన్న అందాల తార. తాజాగా ఓ వీడియో షేర్ చేసిన సురేఖ వాణి. 'బొమ్మరిల్లు'లో జెనీలియా చెప్పే డైలాగ్ తో రిల్ చేసి అలరించింది. తానే కాదు.. తన కూతురు సుప్రీతతోనూ కలిసి సామాజిక మాధ్యమాల్లో తెగ రచ్చ చేస్తోంది. మోడ్రన్ అండ్ గ్లామరస్ డ్రెస్సుల్లో కూతురితో డ్యాన్స్ వీడియోలతో నెట్టింట సందడి చేస్తోంది. తన ఫొటోలు, వీడియోలపై ట్రోలింగ్ వచ్చినా పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది. Image Credits : Surekha Vani/Instagram