Chiranjeevi Surgery : అమెరికాలో చిరంజీవి కాలికి సర్జరీ - సమస్య ఏమిటంటే?
చిరంజీవి కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్లారు. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. అయితే... ఆయన విహార యాత్రకు వెళ్లారని భావించారంతా! ఆ ట్రిప్ వెకేషన్ కాదని, మెడికల్ ట్రీట్మెంట్ కోసమని తెలిసింది.
![Chiranjeevi Surgery : అమెరికాలో చిరంజీవి కాలికి సర్జరీ - సమస్య ఏమిటంటే? Chiranjeevi underwent minor leg surgery in his recent USA trip, Know Details Chiranjeevi Surgery : అమెరికాలో చిరంజీవి కాలికి సర్జరీ - సమస్య ఏమిటంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/25/e989a49934550f53c220bd8cf35c4a9c1690293995978313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అమెరికాలో! కొన్ని రోజుల క్రితం భార్య సురేఖతో కలిసి ఆయన అగ్ర దేశానికి వెళ్లారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు. 'భోళా శంకర్' చిత్రీకరణ పూర్తి చేసిన చిరు... తర్వాత సినిమా ప్రారంభించడానికి ముందు కొన్ని రోజులు విహార యాత్రకు వెళ్లారని భావించారంతా! అయితే... అసలు కథ వేరే ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా.
చిరంజీవి కాలికి సర్జరీ!
Chiranjeevi Leg Surgery In USA : చిరంజీవి కొన్ని రోజులుగా కాలి సమస్యతో ఇబ్బంది పడుతున్నారట. అమెరికా వెళ్ళింది కూడా ఆ సమస్య నుంచి రిలీఫ్ కోసమని తెలిసింది. కొన్ని రోజులు టూర్ వేయడంతో పాటు మధ్య కాలికి సర్జరీ కూడా చేయించుకున్నారు మెగాస్టార్. ఈ విషయాన్ని మొదట రహస్యంగా ఉంచినప్పటికీ... కాస్త ఆలస్యంగా బయటకు వచ్చేసింది.
అసలు సమస్య ఏమిటి? అనేది బయట పెట్టడం లేదు కానీ... ఇదేమంత పెద్ద ఆందోళన చెందాల్సిన అంశం కాదని, చిరు కాలికి చాలా జరిగినది మైనర్ సర్జరీ అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎయిర్ పోర్టులో హ్యాపీగా నడుస్తూ వెళ్లారు కనుక మెగా అభిమానులు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చిరంజీవి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత...
చిరంజీవి అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పెద్దమ్మాయి సుస్మితా కొణిదెలకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో సినిమా చేయనున్నారు. ఆల్రెడీ ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. మలయాళ హిట్ 'బ్రో డాడీ'కి అది రీమేక్ అని ప్రచారం జరుగుతోంది.
Also Read : ధనుష్ పాన్ ఇండియా సినిమాలో అక్కినేని నాగార్జున!
చిరంజీవి అమెరికా నుంచి వచ్చిన తర్వాత 'భోళా శంకర్' ప్రచార కార్యక్రమాలు షురూ చేయనున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఇందులో చిరు జోడీగా తమన్నా భాటియా నటించారు. చిరు సోదరిగా కీర్తీ సురేష్, ఆమె ప్రేమించిన అబ్బాయిగా సుశాంత్ కనిపించనున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు.
Also Read : వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ
తమన్నా ముద్దు పేరు 'మిల్కీ బ్యూటీ' (Milky Beauty) అంటూ రాసిన గీతాన్ని ఈ మధ్య తమన్ విడుదల చేశారు. చిరంజీవి గారి సినిమాలో పాటను విడుదల చేయడం తన అదృష్టం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మెగాస్టార్ మూవీకి పని చేయడం ఒత్తిడితో కూడుకున్న పని అని చెప్పుకొచ్చారు. చిరంజీవి గారి సినిమాలకు మణిశర్మ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించారని... ఇప్పుడు 'భోళా శంకర్'కు మణిగారి అబ్బాయి సంగీతం అందిస్తున్న మహతి స్వరసాగర్ మీద ఆ ఒత్తిడి ఉంటుందని తెలిపారు.
'నా మిల్కీ బ్యూటీ, నువ్వే నా స్వీటీ' అంటూ సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. విజయ్ ప్రకాష్, మహతి స్వర సాగర్, సంజన ఆలపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలతో పోలిస్తే... 'మిల్కీ బ్యూటీ' మెలోడియస్ సాంగ్. ఈ పాటకు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)