మై డియర్ దొంగ రివ్యూ, ప్రియుడితో పూజా హెగ్డే పెళ్లి? - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
Abhinav Gomatam, Shalini Kondepudi and Divya Sripada's My Dear Donga movie review in Telugu: కథ ఎలాగున్నా, క్యారెక్టర్ ఏదైనా తనదైన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు అభినవ్ గోమఠం. ఓటీటీలోనూ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 'సేవ్ ద టైగర్స్'తో హిట్ అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'మై డియర్ దొంగ'. శాలినీ కొండెపూడి హీరోయిన్. అన్నట్టు... ఆవిడే రైటర్ కూడా! ఆహా ఓటీటీ ఒరిజినల్ చిత్రమిది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Pooja Hegde & Rohan Mehra Photos Leaked: సెలబ్రెటీలకి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి గురించి ప్రియుడితో కలిసి ఆమె ఏడడుగులు వేయబోతున్నారనే వార్త బాగా వైరల్ అవుతోంది. అంతే కాదు.. ఆమెకు సంబంధించి, ప్రియుడికి సంబంధించిన ఒక ఫొటో కూడా తెగ వైరల్ గా మారింది. పూజా హెగ్డే తన ప్రియుడిని తల్లిదండ్రులకు పరిచయం చేసిందని, అందుకే ఇద్దరు ఒక హోటల్ కి డిన్నర్ కి వచ్చారనే రూమర్ ఊపందుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'కేరింత'తో తెలుగు చిత్రసీమకు 'దిల్' రాజు పరిచయం చేసిన హీరోల్లో పార్వతీశం (Parvateesam) ఒకరు. ఆ సినిమాలో ఆయన శ్రీకాకుళం యాస, నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 'కేరింత' తర్వాత వైవిధ్యమైన, విలక్షణ కథలు ఎంపిక చేసుకుని సినిమాలు చేశారు. కానీ, ఆ స్థాయి విజయం రావడం లేదు. ఇవాళ 'మార్కెట్ మహాలక్ష్మీ' సినిమా (Market Mahalakshmi Movie)తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ప్రణీకాన్వికా నటించారు. మార్కెట్‌లో కాయగూరలు అమ్మే అమ్మాయితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే అబ్బాయి ప్రేమలో పడితే? అనేది సినిమా కాన్సెప్ట్. వీఎస్ ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Roshan Kanakala Interesting Comments on Mother Suma: యాంకర్ సుమ ఎనర్జీ, టైమింగ్ పంచ్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎంతో కాలంగా టెలివిజన్ రంగంలో తనదైన యాంకరింగ్‌తో రాణిస్తుంది. సెలబ్రిటీస్ అయినా, సాధారణ ఆడియన్స్ అయినా అందరికి తన పంచ్ డైలాగ్స్‌తో ఇచ్చి పడేస్తుంది. యాంకరింగ్‌తో ఎంతో వినోదం పంచే సుమ నాలుగు పదుల వయసులోనూ అంతే ఎనర్జీతో స్టార్ యాంకర్‌గా కొనసాగతుంది. ఇప్పటికీ ఆమెకు బీట్ చేసే మేల్, ఫీమేల్ యాంకర్స్ లేరనడంతో సందేహం లేదు. ఎన్నో స్టేజ్‌లపై స్టార్ హీరో సైతం సుమ యాక్టివ్, ఎనర్జీకి సీక్రెట్ సర్‌ప్రైజ్ అవుతుంటారు. ఇక ఇండస్ట్రీలో చాలా మంది తమకు సుమ ఇన్‌స్పరేషన్ అని చెబుతుంటారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Sekhar Kammula About Leader Sequel: అన్ని సినిమాలు వేరు.. శేఖర్ కమ్ముల సినిమాలు వేరు. ఆయన స్క్రీన్‌ప్లేలో కొత్తదనం ఉంటుంది. ఎన్నాళ్ల తర్వాత చూసిన అందులో ఫ్రెష్‌నెస్ ఉంటుంది. అంతగా తన మేకింగ్, టేకింగ్‌తో ఆకట్టుకుంటారు ఆయన. ఆయన సినిమాల్లో సహజత్వం ఉంటుంది. ఆయన కథలన్ని సమాజం నుంచి పుట్టుకొచ్చినవే ఉంటాయి. ఏ జానర్ తీసుకున్న రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటాయి. అందుకే శేఖర్ కమ్ముల చిత్రాలు ప్రత్యేకం. అలా ఆయన చేసిన కొన్ని సిమాలకు సీక్వెల్స్ కూడా ఉన్నాయంటూ వార్తలు వచ్చినా అవి.. ప్రచారం వరకే మిగిలిపోయాయి. అలా ఆయన తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా లీడర్ మూవీకి సీక్వెల్ వస్తున్నట్టు ఎంతోకాలం వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దానిపై క్లారిటీ లేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)