Satyadeep Misra: తండ్రి కాబోతున్న అదితి రావు హైదరి మాజీ భర్త - గతేడాది నటితో పెళ్లి, ఇప్పుడు గుడ్‌న్యూస్
Masaba Gupta first pregnancy: బాలీవుడ్ నటి మసాబా గుప్తా తల్లికాబోతుంది. గతేడాది అదితి రావు హైదరి మాజీ భర్త సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకున్న ఆమె ఏడాదిలోనే గుడ్‌న్యూస్ పంచుకుంది.
![Satyadeep Misra: తండ్రి కాబోతున్న అదితి రావు హైదరి మాజీ భర్త - గతేడాది నటితో పెళ్లి, ఇప్పుడు గుడ్‌న్యూస్ Bollywood Actress Masaba Gupta and Satyadeep Mishra announce first pregnancy Satyadeep Misra: తండ్రి కాబోతున్న అదితి రావు హైదరి మాజీ భర్త - గతేడాది నటితో పెళ్లి, ఇప్పుడు గుడ్‌న్యూస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/19/67336944d0b121ace2c1405dba782d991713525473110929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Masaba Gupta and Satyadeep Mishra announce first pregnancy: ఆదితి రావు హైదరి మాజీ భర్త సత్యదీప్ మిశ్రా తెలుగు వారికి పెద్దగా పరిచయం కాకపోవచ్చు. కానీ ఆదితి రావు పెళ్లితో ఈ మధ్య అతడి పేరు బాగా వినిపిస్తుంది. ఇప్పుడు అతడి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే. సత్యదీప్ తండ్రి కాబోతున్నాడు. అదితితో విడాకులు తర్వాత సత్యదీప్ మళ్లి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, బాలీవుడ్ నటి మసాబాన గుప్తాను అతడు రెండో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె గర్భం దాల్చింది. తాజాగా ఈ విషయాన్ని మసాబా గుప్తా స్వయంగా ప్రకటించింది. "మరోక న్యూస్. రెండు చిన్న అడుగులు మా దగ్గరకు రాబోతున్నాయి! మాకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి. బేబీ ఆన్‌బోర్డ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
దీంతో వారికి బాలీవుడ్ నటీనటుల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. నటి పరిణితి చోప్రా 'కంగ్రాట్స్ మమ' అంటూ విషెస్ తెలిపింది. అలాగే మరో నటి బిపాస బసు వావ్ కంగ్రాట్యూలేషన్స్ (“Aww congratulations. Babies are the best!”) అంటూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే కరీనా కపూర్, శిల్పా శెట్టి, కరిష్మా కపూర్, అనన్య పాండే, మలైకా ఆరోరా, కృతి సనన్ పలువురు స్టార్స్ ఆమె పోస్ట్‌కు కామెంట్స్ చేశారు. కాగా మసాబా గుప్తా అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బాలీవుడ్ ప్రముఖ నటి నీనా గుప్తా కూతురిగా మాసాబా గుప్తా అందరికి సుపరిచితమే. నీనా గుప్తా, ఆమె తండ్రి మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌ల కూతురు ఆమె. తల్లితో కలిసి ముంబైలో నివసిస్తున్న మసాబా ఫ్యాషన్ డిజైనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత మసాబా మసాబా అనే సిరీస్‌తో నటిగా పరిచయం అయ్యంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్ మంచి విజయం అందుకుంది. ఈ సిరీస్ సమయంలోనే అదితి రావు మాజీ భర్త సత్యదీప్ మిశ్రాతో పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారింది.
View this post on Instagram
ఇద్దరికి రెండో పెళ్లే!
కొంతకాలం డేటింగ్ అనంతరం వీరు 2023లో పెళ్లి చేసుకున్నారు. గతేడాది జరిగిన ఈ పెళ్లి వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక మసాబా తండ్రి మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ కూడా హజరయ్యారు. పెళ్లయిన ఏడాదికే మసాబా తాజాగా గుడ్‌న్యూస్ చెప్పడంతో ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక మసాబాకు కూడా ఇది రెండో వివాహమే. గతంలో ఆమె టాలీవుడ్ నిర్మాత మధు మంతెనను వివాహం చేసుకుంది. ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా అతడితో విడాకులు తీసుకుని విడిపోయింది. ఇక సత్యదీప్ మిశ్రా కూడా అదితి రావు హైదరి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోయారు.ఇక అదితి విడాకుల తర్వాత కొంతకాలానికి అతడు మసాబాతో ప్రేమలో పడ్డాడు. అనంతరం గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అదితి రావు హైదరి కూడా మరో పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే. హీరో సిద్ధార్థ్‌తో ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు.
Also Read: 'లీడర్' సీక్వెల్‌పై అప్‌డేట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల - ఈసారి కూడా రానానే హీరో!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)