అన్వేషించండి

Sekhar Kammula: 'లీడర్‌' సీక్వెల్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన శేఖర్‌ కమ్ముల - ఈసారి కూడా రానానే హీరో!

Sekhar Kammula About Leader 2: అన్ని సినిమాలు వేరు.. శేఖర్‌ కమ్ముల సినిమాలు వేరు. ఆయన  స్క్రీన్‌ప్లేలో కొత్తదనం ఉంటుంది. ఎన్నాళ్ల తర్వాత చూసిన అందులో ఫ్రెష్‌నెస్‌ ఉంటుంది.

Sekhar Kammula About Leader Sequel: అన్ని సినిమాలు వేరు.. శేఖర్‌ కమ్ముల సినిమాలు వేరు. ఆయన  స్క్రీన్‌ప్లేలో కొత్తదనం ఉంటుంది. ఎన్నాళ్ల తర్వాత చూసిన అందులో ఫ్రెష్‌నెస్‌ ఉంటుంది. అంతగా తన మేకింగ్‌, టేకింగ్‌తో ఆకట్టుకుంటారు ఆయన. ఆయన సినిమాల్లో సహజత్వం ఉంటుంది. ఆయన కథలన్ని సమాజం నుంచి పుట్టుకొచ్చినవే ఉంటాయి. ఏ జానర్‌ తీసుకున్న రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉంటాయి. అందుకే శేఖర్‌ కమ్ముల చిత్రాలు ప్రత్యేకం. అలా ఆయన చేసిన కొన్ని సిమాలకు సీక్వెల్స్‌ కూడా ఉన్నాయంటూ వార్తలు వచ్చినా అవి.. ప్రచారం వరకే మిగిలిపోయాయి. అలా ఆయన తెరకెక్కించిన పొలిటికల్‌ డ్రామా లీడర్‌ మూవీకి సీక్వెల్‌ వస్తున్నట్టు ఎంతోకాలం వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దానిపై క్లారిటీ లేదు.

తాజాగా లీడర్‌ సీక్వెల్‌పై స్వయంగా ఆయనే అప్‌డేట్‌ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన కాలేజ్‌ డ్రామా హ్యాపీ డేస్‌ ఈ రోజు (ఏప్రిల్‌ 19) రీరిలీజ్‌ అయ్యింది. హ్యాపీడేస్‌ రీరిలీజ్‌, డైరెక్టర్‌ ఆయన 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శేఖర్‌ కమ్ముల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హ్యాపీడేస్‌ రీరిలీజ్‌ అవుతున్నందున్న రీసెంట్‌గా నేను మళ్లీ సినిమా చూశాను. ఏదైన ఔట్‌డేట్‌ అవుతుందని అనుకున్న. కానీ మూవీని ఇప్పటికీ ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఇచ్చింది. ఎప్పుడు చూసిన అలాంటి ఫీలింగ్‌ కలిగేలా హ్యాపీడేస్‌ తెరకెక్కించాం. ఈ చిత్రానికి మ్యూజిక్‌ ప్రాణం పోసింది. ప్రస్తుతం హ్యాపీ డేస్ రీరిలీజ్ యూత్‌కు ఓ పండగలా ఉందనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ ఉందా? అని అడగ్గా.. ఈ సినిమాకు సీక్వెల్‌ చేయాలని ఉంది.

లీడర్ తీయాలని నా మైండ్ లో ఉంది

కానీ కథ సమకూరడం లేదు. నా గ్రాడ్యూయేషన్‌ అయిన పదేళ్లకు హ్యాపీడేస్‌ సినిమా తీశాను. కానీ, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. స్టూడెంట్స్‌ థింకింగ్‌ కూడా మారింది. సీక్వెల్‌ తీసిన ఫస్ట్‌ పార్ట్ వచ్చినంత రెస్పాన్స్‌ రాకపోవచ్చు. ఆ అనుభూతి కూడా కలగకపోవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. ఆయన తెరకెక్కించిన మరో అద్భుతమైన పొలిటికల్‌ డ్రామా 'లీడర్‌'. రానాను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. సగటు రాజకీయాలకు గుర్తు చేసేలా ఉన్న ఈ సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్‌ నుంచి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని గట్టి ప్రచారం జరుగుతుంది. కానీ, ఈ సీక్వెల్‌ తీయాలని తన మైండ్‌లో ఉన్న టైం లేదన్నారు. కానీ లీడర్‌ సీక్వెల్‌ చేస్తే మాత్రం మళ్లీ తప్పకుండా రానాతోనే చేస్తానన్నారు.

నా సినీ కెరీర్ చూసుకుంటే గర్వంగా అనిపిస్తుంది

అప్పట్లో లక్ష కోట్ల అవినీతి అంటే చాలా ఎక్కువని, కానీ ఇప్పటి రాజకీయాలు మరింత దిగజారాయన్నారు. ఒక రాజకీయ నాయకుడు గురించి చెప్పాలంటే అంతకంటే ఎక్కువ చెప్పాలని, ఇవన్ని కుదరికి కథ రాయాలంటే చాలా టైం పడుతుందన్నారు ఆయన. ఇక దర్శకుడిగా తన 24 ఏళ్ల సినీ కెరీర్‌ గురించి ఇలా చెప్పుకొచ్చారు. రెండు దశాబ్ధాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు. డబ్బు పేరు కోసం తాను ఈ రంగంలోకి రాలేదన్నారు. తన సినిమాలన్ని విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి కట్టుబడి తీశానన్నారు. వేగంగా ఏదిపడితే అది అని ఏదో కథ తీసుకుని సినిమా తీయడం కంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని సినిమాలు చేసినా చాలన్నారు. అదే తన అభిమతమన్నారు. ఈ సినీ కెరీర్‌లో తన సినిమాలన్ని సంతృప్తిని ఇస్తున్నాయన్నారు. 

Also Read: ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు - అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు - అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్
Microsoft AP Govt:  రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
Bandi Sanjay: మీరు వినబోయేది నమో నమో పాట -  పాడిన వారు బండి సంజయ్ !
మీరు వినబోయేది నమో నమో పాట - పాడిన వారు బండి సంజయ్ !
Nagam Meets Chandrababu: గుర్తుకొచ్చాయి-చంద్రబాబును కలిసిన నాగం-పాత విషయాలు గుర్తు చేసుకున్న స్నేహితులు
గుర్తుకొచ్చాయి-చంద్రబాబును కలిసిన నాగం-పాత విషయాలు గుర్తు చేసుకున్న స్నేహితులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kerala teen dies due to water fasting | వాటర్ డైట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతీ | ABP DesamYS Jagan YSRCP Formation Day | మెడలో పార్టీ కండువాతో కనిపించిన జగన్..రీజన్ ఏంటంటే | ABP DesamPithapuram Public Talk on Pawan Kalyan | కళ్యాణ్ గారి తాలుకా అని పిఠాపురంలో చెప్పుకోగలుగుతున్నారా.?Gun fire in Chittoor Locals Rescue Operation | పోలీసుల వచ్చేలోపే గన్నులతో ఉన్న దొంగలను పట్టుకున్న స్థానికులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు - అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు - అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్
Microsoft AP Govt:  రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
Bandi Sanjay: మీరు వినబోయేది నమో నమో పాట -  పాడిన వారు బండి సంజయ్ !
మీరు వినబోయేది నమో నమో పాట - పాడిన వారు బండి సంజయ్ !
Nagam Meets Chandrababu: గుర్తుకొచ్చాయి-చంద్రబాబును కలిసిన నాగం-పాత విషయాలు గుర్తు చేసుకున్న స్నేహితులు
గుర్తుకొచ్చాయి-చంద్రబాబును కలిసిన నాగం-పాత విషయాలు గుర్తు చేసుకున్న స్నేహితులు
Pelli Kani Prasad Movie Trailer: 'నాన్నోయ్.. ఎక్స్ పీరియన్సే కాదు ఎక్స్‌పైరీ డేట్ కూడా దగ్గర పడింది' - నవ్వులు పూయిస్తోన్న సప్తగిరి 'పెళ్లి కాని ప్రసాద్' ట్రైలర్
'నాన్నోయ్.. ఎక్స్ పీరియన్సే కాదు ఎక్స్‌పైరీ డేట్ కూడా దగ్గర పడింది' - నవ్వులు పూయిస్తోన్న సప్తగిరి 'పెళ్లి కాని ప్రసాద్' ట్రైలర్
Janasena Party Plenary : జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు- దారులన్నీ పిఠాపురం వైపే!
జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు- దారులన్నీ పిఠాపురం వైపే!
Sailesh Kolanu: 'కోర్ట్' హిట్.. నా సినిమా సేఫ్ - 'హిట్ 3' డైరెక్టర్ శైలేష్ కొలను ఆసక్తికర పోస్ట్, మిర్చిలో ప్రభాస్ ఇమేజ్‌తో హైప్ ఇచ్చేశారుగా..
'కోర్ట్' హిట్.. నా సినిమా సేఫ్ - 'హిట్ 3' డైరెక్టర్ శైలేష్ కొలను ఆసక్తికర పోస్ట్, మిర్చిలో ప్రభాస్ ఇమేజ్‌తో హైప్ ఇచ్చేశారుగా..
Viral News: అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు ఇండియాలో పట్టివేత -  ఏకంగా 8 లక్షల కోట్ ఫ్రాడ్ మరి !
అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు ఇండియాలో పట్టివేత - ఏకంగా 8 లక్షల కోట్ ఫ్రాడ్ మరి !
Embed widget