Tillu Square OTT: ఓటీటీలో పాన్ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్' - రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
Tillu Square OTT Release: టిల్లు స్క్వేర్ ఓటీటీలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఆ రోజు నుంచి ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ రాబోతుంది.
Tillu Square OTT Release Date and Streaming Update: టిల్లుగాడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ముందు నుంచి వినిపిస్తున్న బజ్ ప్రకారమే ఈ మూవీ నెల రోజు ముందే డిజిటల్ ప్రిమియర్‌కి రాబోతుంది. అయితే ఓటీటీలో టిల్లు స్క్వేర్ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతుంది. తాజాగా దీనిపై నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా మార్చి 29న విడుదలైన ఈ మూవీ సూపర్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. జస్ట్ 9 రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఫస్ట్ వీక్‌లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన నిర్మాతలను లాభాల్లో పడేసింది. మొత్తంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.120పైగా కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఇప్పుడు డిజిటల్ ప్రిమియర్‌పై అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 26 నుంచి ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కి రానుంది.
ఒక్క తెలుగులోనే కాదు మిగతా భాషల్లోనూ టిల్లు స్క్వేర్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చింది. హిస్టరి రిపీట్ అవ్వడం నార్మల్. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరి, కెమిస్ట్రీ అన్ని రిపీట్ అవుతాయి. అల్లుంటది టిల్లుతోలని. ఏప్రిల్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి 'టిల్లు స్క్వేర్' రాబోతుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది" అంటూ నెట్‌ఫ్లిక్స్ తమ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కాగా సితార ఎంటర్‌టైన్‍మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నిర్మాత సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 'టిల్లు స్క్వేర్' పాటలకు రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సింగీతం అందించగా భీమ్స్ సిసిరోలియో బ్యాక్‍గ్రౌండ్ స్కోర్ అందించారు.
History repeat avvadam normal. Adhe Tillu vasthe History, mystery, chemistry anni repeat avvuthai. Atluntadhi Tilluthoni. ✨🥰
— Netflix India South (@Netflix_INSouth) April 19, 2024
Tillu Square arrives on 26 April, on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi. pic.twitter.com/SwEzFgJujb
మరోసారి యూత్ ఫిదా చేసిన సిద్ధూ
ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కెమిస్ట్రీ, రొమాన్స్ బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో లిల్లిగా నెగిటివ్ షేడ్‌లో కనిపించింది. తన నటనతో అనుపమ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈసినిమాలో సిద్ధు పంచ్ డైలాగ్స్, డైలాగ్ డెలివరికి మరోసారి యూత్ ఫిదా అయ్యింది. డీజే టిల్లు స్వాగ్ రిపీట్ చేస్తూ సిద్ధూ ప్రతి సీన్‌లో తనదైన పంచ్‌లు, కామెడీతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. మొత్తానికి డీజే టిల్లు లాగే టిల్లు స్క్వేర్‌ను వన్ మ్యాన్ షోలా ముందుకు నడిపించాడు. ఇందులో సిద్ధు మ్యానరిజంకు అమ్మాయిలు మాత్రం ఫిదా అయ్యారు. అలా అన్ని వర్గాల ఆడియన్స్ ఆకట్టుకున్న టిల్లు స్వ్కేర్ కోసం ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టి మూవీని బ్లాక్‌బస్టర్ హిట్ చేశారు. మొదటి నుంచి టిల్లు స్క్వేర్‌కు మంచి క్రేజ్ ఉండటంతో ఫ్యాన్సీ ధరకు ఈ మూవీ ఓటీటీ హక్కులు అమ్ముడైనట్టు సమాచారం. తెలుగులో రిలీజైన ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుందట. తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్‌తో 'టిల్లు స్క్వేర్'ను అందుబాటులోకి తీసుకురానుందని టాక్.
Also Read: క్రేజీ అప్‌డేట్, దుబాయ్ నుంచి వచ్చేసిన మహేష్, రాజమౌళి - ఇక షూటింగ్ అప్‌డేటేనా?