టీవీ, సినీ నటి, బిగ్‌బాస్‌ భామ హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

'కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం' సీరియల్ తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాతో గుర్తింపు పొందిన హిమజ, ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది

తొలుత పనిమనిషి పాత్రతో వెండితెరపై మెరిసిన ఆమె ఆ తర్వాత హీరోయిన్స్‌కి ఫ్రెండ్‌ వంటి సహానటి రోల్స్‌ చేసింది

అయితే తెలుగు అమ్మాయిలకు ఆఫర్స్‌ రావనే అంశంపై ఓ ఇంటర్య్వూలో స్పందించింది

ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు రిజర్వ్‌డ్‌గా ఉండేవారు. అందుకే ఆఫర్స్‌ పెద్దగా వచ్చేవి కావేమో

అలా అని ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌ ఇస్తేనే ఛాన్సులు వస్తాయి అనుకోవడం తప్పు.. అలా అంటే కమిట్‌మెంట్‌ ఇచ్చిన వాళ్లందరికి కూడా ఛాన్స్‌లు రావడం లేదు

అలా అని ఆఫర్స్‌ అందుకుంటున్నా వారంత కమిట్‌మెంట్‌ ఇచ్చారని కాదు. ఎందుకో ముంబై నుంచి వచ్చిన వాళ్లకు మాత్రం ఇక్కడ ఆఫర్స్‌ ఇస్తారు..

వారిలో ఏం నచ్చుతుందో తెలియదు.. అంటూ హిమజ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

Image Source: All Image Credit: itshimaja/Instagram

కాగా హిమజ ధ్రువ, శతమానం భవతి, నేను శైలజ, వ‌రుడు కావ‌లెను, మహానుభావుడు, జనతా గ్యారేజ్ చిత్రాల్లో నటించింది