Pooja Hegde: ప్రియుడిని పెళ్లాడబోతున్న పూజా హెగ్డే? లీకైన ఫొటోలు
Pooja Hegde: హీరోయిన్లు ఒక్కొక్కరు పెళ్లి చేసేసుకుంటున్నారు. ఈ మధ్యే లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కారు. ఇప్పుడు పూజా హెగ్దే త్వరలోనే పెళ్లి చేసకోనుంది?
Pooja Hegde & Rohan Mehra Photos Leaked: సెలబ్రెటీలకి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి గురించి ప్రియుడితో కలిసి ఆమె ఏడడుగులు వేయబోతున్నారనే వార్త బాగా వైరల్ అవుతోంది. అంతే కాదు.. ఆమెకు సంబంధించి, ప్రియుడికి సంబంధించిన ఒక ఫొటో కూడా తెగ వైరల్ గా మారింది. పూజా హెగ్డే తన ప్రియుడిని తల్లిదండ్రులకు పరిచయం చేసిందని, అందుకే ఇద్దరు ఒక హోటల్ కి డిన్నర్ కి వచ్చారనే రూమర్ ఊపందుకుంది.
రోహన్ మెహ్రాతో రిలేషన్?
పూజా హెగ్డే టాలీవుడ్, బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసింది ఈ భామ. హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఖాతాలో పడటంతో కొంచెం క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు పూజా హెగ్డే ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అది కూడా తన పెళ్లి రూమర్స్ తో. పూజా హెగ్డే, బాలీవుడ్ సెలబ్రిటీ వినోద్ మెహ్రా కొడుకు రోహన్ మెహ్రా ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు బయటికి వచ్చాయి. అయితే, దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇద్దరు.
కానీ, ఈ మధ్యే పూజా హెగ్డే ఆమె తల్లిదండ్రులతో కలిసి ఒక హోటల్ కి డిన్నర్ కి వచ్చింది. ఆమె ఫ్యామిలీతో వెళ్లిపొయిన కొద్దిసేపటికే రోహన్ మెహ్రా కూడా అదే హోటల్ నుంచి బయటికి వచ్చాడు. వీళ్లిద్దరు అక్కడే ఉన్న కొంతమంది కెమెరాలకు చిక్కడంతో.. పూజా తన బాయ్ ఫ్రెండ్ ని పేరెంట్స్ కి పరిచయం చేసేందుకు తీసుకొచ్చిందని, త్వరలోనే వాళ్లు ఇద్దరుపెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా రోహన్ , పూజా ఇద్దరు కారులో లేట్ నైట్ లాంగ్ డ్రైవ్ వెళ్లినట్లుగా కూడా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. మరి పూజా దీనిపై ఎలా స్పందిస్తుందో.
క్రికెటర్‌తో పెళ్లి?
పూజా హెగ్డే పెళ్లికి సంబంధించిన రూమర్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె ఎవరో క్రికెటర్ తో రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతుంది అనే వార్తలు అప్పట్లో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే, అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ఇక ఆ తర్వాత.. 2020లో పూజా హెగ్డే, రోహన్ ఇద్దరు హర్ష వర్దన్ ఇంటి దగ్గర కలిసి కనిపించడంతో ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి.
ఇక సినిమాల విషయానికొస్తే పూజా హెగ్డే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు నటిస్తున్నారు. షాహిద్ కపూర్ తో కలిసి 'దేవ' సినిమాలో కనిపించబోతోంది పూజా. ఇక సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి సరసన రొమాంటిక్ మూవీ 'సంఘీ'లో కూడా నటిస్తోంది ఆమె. రాహుల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. బాజీరావ్ మస్తానీ సినిమాకి ఆయన అసిస్టెంట్ గా చేశారు. ఆ తర్వాత 'బజార్' లో చిన్న రోల్, '420 ఐపీఎస్' లో సపోర్టింగ్ రోల్ చేశారు రోహన్. ప్రస్తుతం అద్భుతం సినిమాతో పాటుగా కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు.
Also Read: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ