Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Pushpa 2 Pre Release Business Creates Records: 'పుష్ప2' కళ్లు చెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. విడుదలకు ముందు వెయ్యి కోట్లు రాబట్టి... బాలీవుడ్ హీరోలను బీట్ చేసి నంబర్ వన్ రేసులోకి వెళ్లాడు బన్నీ.
ఆల్ టైమ్ రికార్డ్... పాన్ ఇండియా రేంజ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ హయ్యస్ట్ క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 'పుష్ప 2' సినిమా (Pushpa 2 Movie)తో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కొత్త రికార్డులు లిఖించాడు. బాలీవుడ్ హీరోలను బీట్ చేశాడు. హిందీలో ఖాన్ హీరోలకు, పాన్ ఇండియాలో పాపులారిటీ సొంతం చేసుకున్న దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి వాళ్లకు సాధ్యం కానీ రికార్డును బన్నీ క్రియేట్ చేశారు.
1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఏంటి సామి...
బాలీవుడ్ బడా హీరోలకు సైతం సాధ్యం కాలేదు!
Pushpa 2 Pre Release Business: పుష్పరాజ్... ఆ పేరును ఒక బ్రాండ్ చేసిన ఘనత బన్నీది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ క్రియేట్ చేసిన క్యారెక్టర్‌ను తన మేనరిజమ్స్, నటనతో నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్లాడు బన్నీ. దాంతో 'పుష్ప' భారీ హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ 'పుష్ప 2' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ సినిమా మీద బీభత్సమైన హైప్ ఉంది. అందుకు తగ్గట్టు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
'పుష్ప 2' విడుదలకు ఇంకా నాలుగు నెలల టైమ్ ఉంది. ఆల్రెడీ డిజిటల్, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. అదీ కళ్లు చెదిరే అమౌంట్స్, ఇప్పటి వరకు హిందీ హీరోలకు సైతం జరగని బిజినెస్ జరగడంతో బాలీవుడ్ ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయింది.
Pushpa 2 North India Rights: 'పుష్ప 2' నార్త్ ఇండియా రైట్స్ రూ. 200 కోట్లు ఇచ్చి ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ తీసుకున్నారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్' సినిమాల కంటే హయ్యస్ట్ అమౌంట్ ఇచ్చి తీసుకున్నారు. సౌత్ స్టేట్స్ వచ్చే సరికి థియేట్రికల్ రైట్స్ ద్వారా ఆల్మోస్ట్ రూ. 270 కోట్లు వచ్చాయట. టోటల్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 550 కోట్లు వచ్చాయి.
Also Read: మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
'పుష్ప 2' ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆల్ లాంగ్వేజెస్ రైట్స్ కోసం రూ. 270 కోట్లు ఇచ్చింది. శాటిలైట్, ఆడియో రైట్స్ యాడ్ చేస్తే రూ. 450 కోట్లు రీచ్ అవ్వొచ్చని అంచనా. దాంతో టోటల్ బిజినెస్ రూ. 1000 కోట్లకు చేరుకుంది. ఈ రేంజ్ బిజినెస్ మరో ఇండియన్ సినిమాకు జరగలేదు. ఫస్ట్ టైమ్ ఇండియన్ సినిమా 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఫీట్ అందుకోవడం అల్లు అర్జున్ 'పుష్ప 2'తోనే అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు సైతం చెబుతున్నాయి.
ఆల్ ఇండియా నంబర్ వన్ రేసులోకి బన్నీ!
'పుష్ప' అంటే అల్లు అర్జున్. అల్లు అర్జున్ అంటే పుష్ప. ఆ విషయంలో మరో సందేహం అవసరం లేదు. ఆయన ఇమేజ్ మీద సినిమా బిజినెస్ జరిగింది, జరుగుతోంది. ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకోవడమే కాదు... సినిమా వేల్యూ కూడా పెంచాడు బన్నీ. ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా ఒక్కసారి ఆలిండియా నంబర్ వన్ హీరోల రేసులోకి అల్లు అర్జున్ దూసుకు వెళ్లారు.
ఏపీ & తెలంగాణలో కాదు, తమ స్టార్ హీరోలతో సమానంగా చూసే కేరళలో కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun) తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. 'పుష్ప' వెయ్యి కోట్లు బిజినెస్ చేయడం రికార్డ్. ఆ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తే బన్నీ రేంజ్ మరింత పెరుగుతుంది.
Also Read: పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
తెలుగు సినిమా స్థాయి ఏపీ, తెలంగాణ దాటి పాన్ ఇండియాకు ఎప్పుడో వెళ్లింది. ఆ ఘనతలో కొంత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి దక్కుతుంది. 'బాహుబలి' రెండు పార్టులు, 'ఆర్ఆర్ఆర్' సినిమాతో భారీ వసూళ్లు సాధించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన 'కెజియఫ్' రెండు పార్టులు, 'సలార్' సైతం భారీ వసూళ్లు సాధించాయి. ప్రభాస్ యాడ్ కావడంతో 'సలార్'కు అడ్వాంటేజ్ అయ్యింది. అయితే... రాజమౌళి, ప్రశాంత్ నీల్ అండ లేకుండా నార్త్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ఘనత అల్లు అర్జున్ సొంతమైంది.
Also Read: సందీప్ రెడ్డి వంగా మాస్ - ఆ బాలీవుడ్ యాక్టర్‌కు ఇచ్చి పడేసిన దర్శకుడు