విడాకులకు స్టార్ హీరో దరఖాస్తు, అనుపమకు ఘోర అవమానం - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
![విడాకులకు స్టార్ హీరో దరఖాస్తు, అనుపమకు ఘోర అవమానం - నేటి టాప్ సినీ విశేషాలివే! Top 5 Entertainment Updates Latest Movie and TV News From ABP News April 10th 2024 విడాకులకు స్టార్ హీరో దరఖాస్తు, అనుపమకు ఘోర అవమానం - నేటి టాప్ సినీ విశేషాలివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/1e8c92d7be90becb270bfb68ee821c491712749460720929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'దేవర' (Devara Part 1). 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలో కొమురం భీం పాత్రలో ఆయన నటనకు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఉత్తరాది ప్రేక్షకులు సైతం తారక రాముడి నటనకు ఫిదా అయ్యారు. అందువల్ల, 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాపై నార్త్ ఇండియాలో సైతం అంచనాలు ఎక్కువ ఉన్నాయి. సినిమాకు భారీ డిమాండ్ నెలకొంది. రెండు అగ్ర నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Dhanush And Aishwarya Officially File For Divorce: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరు ధనుష్. ఈ ఇద్దరు 18 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ల వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. యాత్ర, లింగ. చాలా క్యూట కపుల్ వీళ్లిద్దరు అని ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతుంటారు. అలాంటిది ఒక్కసారిగా వీళ్లిద్దరూ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు. తామిద్దరం విడిపోతున్నామని, కలిసి ఉండలేం అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2022లో ఇద్దరు తమ ఇన్ స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు వాళ్లిద్దరూ రీసెంట్ గా విడాకులకి అప్లై చేశారట. మ్యుచువల్ డివర్స్‌కు అప్లై చేశారనే వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ వాళ్ల లవ్ స్టోరీని గుర్తు చేసుకుంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Anupama Parameswaran Insulted at Tillu Square Success Meet: టిల్లు స్క్వేర్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీ వందకోట్ల క్లబ్‌లో చేరిన నేపథ్యంలో గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ మీట్‌కు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హజరయ్యారు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా హజరయ్యారు. ఇక ఈ మూవీ హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టిలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పైకి వచ్చిన అనుపమకు ఈ వెంట్‌లో ఘోర అవమానం ఎదురైంది. ఆమె మాట్లాడుతుండగా నందమూరి ఫ్యాన్స్ తీరు ఆమె ఇబ్బంది పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Fahadh Faasil opens up about his role in pushpa 2 : మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ 'పుష్ప' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతలా చేరువయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు మలయాళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన 'పుష్ప' మొదటి భాగంలో పోలీస్ ఆఫీసర్ గా తన క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ తో ఆడియన్స్ లో బలమైన ముద్ర వేసుకున్నారు. ఇక ఇప్పుడు 'పుష్ప 2'లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. పార్ట్ వన్ లో కనిపించింది కొంత సేపే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో బన్నీని నామినేట్ చేసిన ఫాహాద్ పజిల్ ఇప్పుడు 'పుష్ప 2' లో ఎలాంటి రోల్ లో కనిపించబోతున్నాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే తాజాగా 'పుష్ప 2' లో తన రోల్ ఎలా ఉంటుందో ఫాహాద్ ఫాజిల్ స్వయంగా రివీల్ చేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Manjummel Boys Movie OTT Platform and Streaming Date Details: ఈ మధ్య భాషతో సంబంధం అన్ని సినిమాలు అన్ని భాషల్లోనూ సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా మలయాళ చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. తెలుగులో డబ్బింగ్ కాకపోయినా సబ్ టైటిల్స్‌తోనే చూసి ఇక్కడ హిట్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణ రీసెంట్‌గా వచ్చిన 'ప్రేమలు', ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలే. ప్రేమలు మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. తెలుగులో కూడా మలయాళ భాషలోనే ఆడియన్స్ ఆదరణ పొందింది. ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ 'ప్రేమలు'ను ఎస్‌ఎస్ రాజమౌళి తనయుడు తెలుగులో రిలీజ్ చేశారు. కార్తికేయ ఈ సినిమాను తెలుగులో సమర్పించగా ఇక్కడ మంచి ఆదరణ పొందింది. ఇదే మూవీ బాటలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా వచ్చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)