Dhanush And Aishwarya: విడాకులకు దరఖాస్తు చేసిన ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ - అలా మొదలై.. ఇలా ముగిసిన లవ్ స్టోరీ
Dhanush And Aishwarya: ధనుష్, ఐశ్వర్య లవ్లీ కపుల్ కానీ, ఏమైందో ఏమో తెలీదు. ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రేమించి, పెళ్లి చేసుకున్న వీళ్లు ఇప్పుడిక మ్యుచువల్ డైవర్స్ కి అప్లై చేశారు.
![Dhanush And Aishwarya: విడాకులకు దరఖాస్తు చేసిన ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ - అలా మొదలై.. ఇలా ముగిసిన లవ్ స్టోరీ Dhanush And Aishwarya Officially File For Divorce: A complete timeline of their 18-year-long relationship Dhanush And Aishwarya: విడాకులకు దరఖాస్తు చేసిన ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ - అలా మొదలై.. ఇలా ముగిసిన లవ్ స్టోరీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/08/9b4e50e3b4927b186066677ba0f8ac711712589310019229_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dhanush And Aishwarya Officially File For Divorce: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరు ధనుష్. ఈ ఇద్దరు 18 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ల వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. యాత్ర, లింగ. చాలా క్యూట కపుల్ వీళ్లిద్దరు అని ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతుంటారు. అలాంటిది ఒక్కసారిగా వీళ్లిద్దరూ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు. తామిద్దరం విడిపోతున్నామని, కలిసి ఉండలేం అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2022లో ఇద్దరు తమ ఇన్ స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు వాళ్లిద్దరూ రీసెంట్ గా విడాకులకి అప్లై చేశారట. మ్యుచువల్ డివర్స్‌కు అప్లై చేశారనే వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ వాళ్ల లవ్ స్టోరీని గుర్తు చేసుకుంటున్నారు.
ధనుష్ కంటే.. ఐశ్వర్య రెండేళ్లు పెద్ద..
ధనుష్, ఐశ్వర్య ఇద్దరు చిన్న ఏజ్‌లోనే ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. ‘కాదల్ కొండేని సినిమా చూసేందుకు అలబర్ట్ థియేటర్ కి వెళ్లిన ఐశ్వర్య ధనుష్‌ను అప్రిషియేట్ చేస్తూ.. ఫ్లవర్స్ పంపిచడంతో వాళ్ల ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఐశ్వర్యకి ధనుష్ ఫోన్ చేయడంతో.. అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అలా 2004, నవంబర్ 14న వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి టైంకి ఐశ్వర్యకు 23 ఏళ్లు, ధనుష్ కి 21 ఏళ్లు.
2012లో డైరెక్టర్‌గా ఐశ్వర్య
ఐశ్వర్య 2012లో మొదటిసారి సినిమాని డైరెక్ట్ చేసింది. అది కూడా ధనుష్ హీరోగా. ధనుష్, శృతి హాసన్ నటించిన '3' సినిమాకి ఐశ్వర్య డైరెక్షన్ చేసింది. ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్ కానప్పటికీ.. దాంట్లోని 'వై దిస్ కొలవరి' పాట మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ పాటతోనే ధనుష్ నేషనల్ స్టార్ అయ్యాడు.
2022లో విడాకులు..
చిన్న వయసులో పెళ్లి చేసుకున్న ధనుష్, ఐశ్వర్య ఇద్దరు అనోన్యంగానే ఉండేవాళ్లు. ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అయితే, అనుకోకుండా షెడన్ గా 2022 జనవరిలో ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. "పెళ్లైన 18 ఏళ్లకు విడిపోతున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు ఇద్దరు. 18 ఏళ్లు ఫ్రెండ్స్ గా, కపుల్ గా, పేరెంట్స్ గా, వెల్ విషర్స్ గా ఇద్దరు కలిసున్నాం. ఈ ప్రయాణంలో ఎదుగుదల, సర్దుబాటు, అలవాట్లు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అన్ని చూశాం. ఇప్పుడు ఇద్దరం వేర్వేరు దారులు చూసుకుంటున్నాం. ఐశ్వర్యం, నేను విడిపోవాలని అనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించి.. మమల్ని అర్థం చేసుకుంటారని, దీని నుంచి బయటికి వచ్చేందుకు మాకు ప్రైవసీ ఇస్తారని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయా. స్ప్రెడ్ లవ్" అంటూ రాసుకొచ్చారు ధనుష్. ఇదే విషయాన్ని చెప్తూ.. ఐశ్వర్య కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Also Read: నీ భర్త నాగచైతన్యను ఎందుకు మోసం చేశావ్? - నెటిజన్ ప్రశ్నకి సమంత స్ట్రాంగ్ కౌంటర్, ఏమన్నదంటే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)