Devara: 'దేవర'కు బాలీవుడ్‌లో భారీ డిమాండ్ - రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి...
Devara North India Theatrical Distribution Rights: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా 'దేవర' మీద బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ నెలకొంది. అగ్ర నిర్మాణ సంస్థలు రైట్స్ తీసుకున్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'దేవర' (Devara Part 1). 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలో కొమురం భీం పాత్రలో ఆయన నటనకు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఉత్తరాది ప్రేక్షకులు సైతం తారక రాముడి నటనకు ఫిదా అయ్యారు. అందువల్ల, 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాపై నార్త్ ఇండియాలో సైతం అంచనాలు ఎక్కువ ఉన్నాయి. సినిమాకు భారీ డిమాండ్ నెలకొంది. రెండు అగ్ర నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నాయి.
కరణ్ జోహార్ & అనిల్ తడానీ చేతికి...
'దేవర' నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూషన్!
'దేవర' నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కుల్ని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar)కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్, అలాగే మరో నిర్మాత అనిల్ తడానీకి చెందిన ఏఏ ఫిలిమ్స్ సొంతం చేసుకున్నాయి. ఈ విషయాన్ని ఈ రోజు వెల్లడించారు. ఎన్టీఆర్, 'దేవర' దర్శకుడు కొరటాల శివతో కలిసి కరణ్ జోహార్, అనిల్ తడానీ దిగిన ఫోటోను విడుదల చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 10న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే
Also Read: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో విరాట్ రాజ్... గణేష్ మాస్టర్ డైరెక్షన్ డెబ్యూ
Happy to join forces with the dynamic distributors of our country, Karan Johar and AA Films for the North India theatrical distribution of #Devara! 🌊
— Devara (@DevaraMovie) April 10, 2024
Looking forward to a thunderous release on 10th October 2024! ⚡️
Man of Masses @tarak9999 #KoratalaSiva #KaranJohar… pic.twitter.com/AoSYQsteXa
'బాహుబలి' సినిమాను హిందీలో కరణ్ జోహార్ విడుదల చేశారు. 'కెజియఫ్' సహా పలు సౌత్ హిట్ సినిమాలను ఉత్తరాదిలో అనిల్ తడానీ విడుదల చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి 'దేవర'ను విడుదల చేస్తుండటం విశేషం. ప్రేక్షకులకు భారీ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి రెడీ 'దేవర' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నామని, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర'లో తాము భాగం కావడం సంతోషంగా ఉందని కరణ్ జోహార్ పేర్కొన్నారు.
Also Read: శర్వానంద్ 38వ సినిమా ఫిక్స్ - డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్!?
Karan Johar’s Instagram post about @tarak9999’s #Devara. pic.twitter.com/blpNjyWMrg
— .... (@ynakg2) April 10, 2024
కాలర్ ఎత్తుకునేలా ఉంటుంది...
అంచనాలు పెంచిన ఎన్టీఆర్!
ఇటీవల 'టిల్లు స్క్వేర్' విజయోత్సవ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. అప్పుడు ఆయన 'దేవర' గురించి మాట్లాడారు. విడుదల ఆలస్యం అయినా సరే అందరూ కాలర్ ఎత్తుకునేలా ఉంటుందని చెప్పారు. దాంతో ఫ్యాన్స్, ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Devara Movie Cast And Crew: 'దేవర'లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బీ టౌన్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె ప్రొడ్యూసర్లు.