అన్వేషించండి

Sharwanand 38 Movie: శర్వానంద్ 38వ సినిమా ఫిక్స్ - డిఫరెంట్ ఫిల్మ్ మేకర్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్!?

Sharwanand new movie: ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటి తర్వాత సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యిందని తెలిసింది. ఆ చిత్రానికి దర్శకుడు ఎవరంటే?

యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) స్పీడ్ పెంచారు. గత ఏడాది (2023లో) ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అలాగని, ఆయన ఖాళీగా లేరు. కొత్త కథలు వింటూ వరుసగా ఒక్కో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో 'మనమే' విడుదలకు రెడీ అవుతోంది. శర్వా బర్త్ డే సందర్భంగా మరో రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. ఇప్పుడు మరో సినిమా ఓకే చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శర్వా!
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన 'ఘాజి'తో దర్శకుడిగా పరిచయమైన సంకల్ప్ రెడ్డి గుర్తు ఉన్నారుగా? ఆ సినిమా తర్వాత వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'అంతరిక్షం 9000 కెఎంపీహెచ్' తీశారు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకున్నా... రెండు డిఫరెంట్ సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా ఏబీపీ దేశానికి తెలిసింది. హీరోగా శర్వానంద్ 38వ చిత్రమిది.

'అంతరిక్షం' తర్వాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఏదీ తెలుగులో విడుదల కాలేదు. కానీ, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన యాంథాలజీ ఫిల్మ్ 'పిట్ట కథలు'లో 'పింకీ'కి దర్శకత్వం వహించారు. హిందీలో విద్యుత్ జమాల్ హీరోగా 'ఐబీ 71' తీశారు. ఇప్పుడు శర్వానంద్ హీరోగా కొత్త సినిమా ప్లాన్ చేశారు.

Also Read: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో విరాట్ రాజ్... గణేష్ మాస్టర్ డైరెక్షన్ డెబ్యూ


పాన్ ఇండియా ప్రాజెక్టుగా శర్వా, సంకల్ప్ సినిమా!?
తెలుగులో శర్వానంద్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి సినిమాలు చేస్తారని ఆయనకు పేరు ఉంది. తమిళ ప్రేక్షకులకూ ఆయన తెలుసు. 'ఓకే ఒక జీవితం'తో విజయం అందుకున్నారు కూడా! సంకల్ప్ రెడ్డి తొలి సిఎంమా 'ఘాజి' తెలుగుతో పాటు హిందీలో విడుదలైంది. 'ఐబీ 71'తో హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. శర్వా, సంకల్ప్... ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి చేయబోయే సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Readలవ్ గురు ఓటీటీ రిలీజ్... ఆ రెండు వేదికల్లో రానున్న విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి సినిమా


ప్రస్తుతం శర్వానంద్ చేతిలో ఉన్న సినిమాల విషయానికి వస్తే... శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'మనమే' చేశారు. అదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఆ తర్వాత 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అది స్పోర్ట్స్ డ్రామా. ఆ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ సమర్పణలో విక్రమ్, ప్రమోద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది కాకుండా 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఇంకో సినిమాకు సంతకం చేశారు. దానిని 'నారి నారి నడుమ మురారి' టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. వీటికి తోడు ఇప్పుడు సంకల్ప్ రెడ్డి సినిమా యాడ్ అయ్యింది.

Also Readమైదాన్ రివ్యూ: ఫుట్‌ బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh Collection Day 1 : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Dhurandhar 2 Collections : ధురంధర్ 2 ఫస్ట్ డేనే 100 కోట్లు - వారం రోజుల్లో ఆ రికార్డ్ బ్రేక్!
ధురంధర్ 2 ఫస్ట్ డేనే 100 కోట్లు - వారం రోజుల్లో ఆ రికార్డ్ బ్రేక్!
Vishnu Vinyasam OTT : సడన్‌గా ఓటీటీలోకి విష్ణు విన్యాసం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సడన్‌గా ఓటీటీలోకి విష్ణు విన్యాసం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rashmika Mandanna : ఒకప్పుడు ట్రోలింగ్... ఇప్పుడు అవార్డ్ - తమ ఊరి కోడలికి అవార్డ్ అందించిన సీఎం రేవంత్
ఒకప్పుడు ట్రోలింగ్... ఇప్పుడు అవార్డ్ - తమ ఊరి కోడలికి అవార్డ్ అందించిన సీఎం రేవంత్

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Budget 2026-27: నేడు 3.36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!
నేడు 3.36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!
Ustaad Bhagat Singh Collection Day 1 : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Dhurandhar 2 Collections : ధురంధర్ 2 ఫస్ట్ డేనే 100 కోట్లు - వారం రోజుల్లో ఆ రికార్డ్ బ్రేక్!
ధురంధర్ 2 ఫస్ట్ డేనే 100 కోట్లు - వారం రోజుల్లో ఆ రికార్డ్ బ్రేక్!
Gaddar Awards 2026 : తెలంగాణ గద్దర్ అవార్డ్స్ - బెస్ట్ మూమెంట్స్... ఈవెంట్ హైలెట్స్
తెలంగాణ గద్దర్ అవార్డ్స్ - బెస్ట్ మూమెంట్స్... ఈవెంట్ హైలెట్స్
Eid ul-Fitr 2026: ఈద్-ఉల్-ఫితర్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు!
ఈద్-ఉల్-ఫితర్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు!
Assam Congress troubles: అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
Happy Ramadan Wishes 2026: రంజాన్ శుభాకాంక్షలు! ఈ కొటేషన్స్ తో మీ బంధు మిత్రులకు ఈద్‌ ఉల్‌ ఫితర్‌ విషెస్ తెలియజేయండి!
రంజాన్ శుభాకాంక్షలు! ఈ కొటేషన్స్ తో మీ బంధు మిత్రులకు ఈద్‌ ఉల్‌ ఫితర్‌ విషెస్ తెలియజేయండి!
Rashmika Mandanna : ఒకప్పుడు ట్రోలింగ్... ఇప్పుడు అవార్డ్ - తమ ఊరి కోడలికి అవార్డ్ అందించిన సీఎం రేవంత్
ఒకప్పుడు ట్రోలింగ్... ఇప్పుడు అవార్డ్ - తమ ఊరి కోడలికి అవార్డ్ అందించిన సీఎం రేవంత్
Embed widget