Love Guru OTT: లవ్ గురు ఓటీటీ రిలీజ్ - రెండు ప్లాట్‌ఫార్మ్స్‌లోకి రానున్న విజయ్ ఆంటోనీ సినిమా
OTT partners locked for Vijay Antony and Mirnalini Ravi's Love Guru: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'లవ్ గురు'. ఈ సినిమా ఏ ఓటీటీలోకి రానుందో తెలుసా? ఒకటి కాదు, రెండు ఓటీటీల్లోకి రానుంది.
Love Guru, Telugu version of Tamil film Romeo OTT Platform: విజయ్ ఆంటోనీ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'లవ్ గురు'. ఈ శుక్రవారం... అంటే ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల అవుతోంది. తమిళంలో 'రోమియో'గా తెరకెక్కిన సినిమాకు తెలుగు డబ్బింగ్ ఇది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా ఏ ఓటీటీలో విడుదల కానుందో తెలుసా? డిజిటల్ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేసే ప్రేక్షకులకు డబుల్ ధమాకా!
ఆహా, ప్రైమ్ వీడియో... రెండు ఓటీటీలో 'లవ్ గురు'
Love Guru OTT Platform Details: తెలుగు 'లవ్ గురు' / తమిళ్ 'రోమియో' ఫిల్మ్ రెండు ఓటీటీ వేదికల్లో విడుదల కానుంది. ఒకటి... ఆహా. రెండు... అమెజాన్ ప్రైమ్ వీడియో! సోమవారం సాయంత్రం హైదరాబాద్ సిటీలో తెలుగు మీడియాకు 'లవ్ గురు' స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. సినిమాలో తమ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ ఆహా, ప్రైమ్ వీడియో అని స్పష్టం చేశారు.
బహుశా... తెలుగు వెర్షన్ 'లవ్ గురు' ఆహా వీడియోలో, తమిళ్ వెర్షన్ 'రోమియో' ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కావచ్చు. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్ బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?
విజయ్ ఆంటోనీ జోడీగా మృణాళిని రవి
Love Guru Movie Release Updates: 'లవ్ గురు' సినిమాలో విజయ్ ఆంటోనీ జోడీగా 'గద్దలకొండ గణేష్' ఫేమ్ మృణాళిని రవి నటించారు. తెలుగులో భాష్య శ్రీ మాటలు, పాటలు రాశారు. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడులోనూ సేమ్ డే రిలీజ్ కానుంది. తెలుగులో 'బిచ్చగాడు' తర్వాత ఆ స్థాయి విజయం 'లవ్ గురు' అందిస్తుందని విజయ్ ఆంటోనీ నమ్మకంగా ఉన్నారు.
Also Read: అయ్యయ్యో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్... 'బడే మియా చోటే మియా'తో పరువు అంతా పోయింది కదయ్యా
'లవ్ గురు' చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై మీరా విజయ్ ఆంటోనీ ప్రొడ్యూస్ చేశారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే...
ఇంట్లో తండ్రి మాటకు ఎదురు చెప్పలేక, ఆయన పోరు పడలేక ప్రియా అనే అమ్మాయి తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి సరే అంటుంది. పెళ్లి చూపుల్లో కాబోయే భర్తకు కొన్ని కండిషన్స్ పెడుతుంది. అమ్మాయి నచ్చడంతో ఆ అబ్బాయి అరవింద్ ఆమె చెప్పిన దానికి ఓకే అంటారు. దాంతో పెళ్లైన తర్వాత అతనికి ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా బయట పడ్డారు? భార్యను ప్రేమించడం ఎలాగో తెలుసుకున్నాడా? లేదా? అనేది సినిమా చూసి ప్రేక్షకులు తెలుసుకోవాలి.
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ఈ సినిమాలో వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఫరూక్ జే బాష, సంగీతం: భరత్ ధన శేఖర్, కూర్పు: విజయ్ ఆంటోనీ, నిర్మాత: మీరా విజయ్ ఆంటోనీ, రచన - దర్శకత్వం: వినాయక్ వైద్యనాథన్.