అన్వేషించండి

Bade Miyan Chote Miyan: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్... అయ్యయ్యో పరువు అంతా పాయె మియా

Bade Miyan Chote Miyan release date shifted to April 11: 'బడే మియా చోటే మియా' స్పెషల్ ప్రీమియర్లు ఏప్రిల్ 10న ప్లాన్ చేశారు. వాటిని క్యాన్సిల్ చేసి డైరెక్టుగా ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు.

ప్రీమియర్ షోస్ వెయ్యడం లేటెస్ట్ ట్రెండ్. టాలీవుడ్‌లో రీసెంట్ టైమ్స్‌లో స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలకూ ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. మలయాళ బ్లాక్ బస్టర్ 'మంజుమ్మెల్ బాయ్స్' ప్రీమియర్ షోస్ టికెట్స్ ఓపెన్ చెయ్యడం లేట్, హాట్ కేక్స్ అన్నట్టు అమ్ముడు అయ్యాయి. బాలీవుడ్‌లో ప్రీమియర్ షోస్ ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది. అయితే, ఆ షోస్ క్యాన్సిల్ చెయ్యడం అన్నది రేర్. స్టార్ హీరోల సినిమాలకు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. టికెట్స్ ఓపెన్ చేసిన క్షణాల్లో షోస్ ఫుల్ అవుతాయి. అయితే, 'బడే మియా చోటే మియా' (Bade Miyan Chote Miyan Movie) విషయంలో కంప్లీట్ రివర్స్ ట్రెండ్ కనిపించడంతో షోస్ క్యాన్సిల్ చేశారని బాలీవుడ్ గుసగుస.

ఏప్రిల్ 10న నో షోస్... ఏప్రిల్ 11న విడుదల
బాలీవుడ్ ఖిలాడీ కుమార్ అక్షయ్ (Akshay Kumar), యంగ్ స్టార్ టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) హీరోలుగా నటించిన సినిమా 'బడే మియా చోటే మియా'. ఈ వారం హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. తొలుత ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం నుంచి స్పెషల్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే, ఏప్రిల్ 10 నుంచి రిలీజ్ డేట్ 11కు షిఫ్ట్ చేశారు.

Also Readమైదాన్ రివ్యూ: ఫుట్‌ బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?

రంజాన్ సందర్భంగా 'బడే మియా చోటే మియా' సినిమాను విడుదల చేయాలనేది తమ ప్లాన్ అని, అయితే ఇండియాలో రంజాన్ ఏప్రిల్ 11న వస్తుంది కనుక ఆ రోజు విడుదల చేస్తున్నామని హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ చెప్పారు. అందులో నిజం లేదని, అసలు మ్యాటర్ వేరనేది ట్రేడ్ వర్గాల టాక్.

Also Readఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?

'బడే మియా చోటే మియా' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఆడియన్స్ నుంచి మినిమమ్ రెస్పాన్స్ కూడా రాలేదని, షోస్ హౌస్ ఫుల్ కాకపోవడంతో షోస్ క్యాన్సిల్ చేశారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్షయ్ కుమార్ రీసెంట్ మూవీస్ ఒక్కటి కూడా సరైన విజయం సాధించలేదు. అటు టైగర్ ష్రాఫ్ మూవీస్ అంతంత మాత్రంగా ఆడుతున్నాయి. దాంతో ఆడియన్స్ ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. రిలీజుకు ముందు 'బడే మియా చోటే మియా' ఫ్లాప్ అయ్యిందని కామెంట్స్ సైతం వినబడుతున్నాయి.

Also Readనాగ చైతన్య, అల్లు అరవింద్ సేఫ్ - కర్మ అనేది వదిలి పెట్టదురా పెట్ల!

'బడే మియా ఛోటే మియా'ను పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏఏజెడ్ ఫిలిమ్స్ సంస్థలతో వశు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, రకుల్ భర్త జాకీ భగ్నానీ ప్రొడ్యూస్ చేశారు. సల్మాన్ ఖాన్ 'సుల్తాన్', 'టైగర్ జిందా హై', 'భారత్' సినిమాలు తీసిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. అక్షయ్ సరసన మానుషీ చిల్లర్, టైగర్ జోడీగా ఆలయ ఫార్ట్యూన్ వాలా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా కీలక తారాగణం. మరి, ఏప్రిల్ 11న థియేటర్లలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget