Family Star: ఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?
Is the story of Family Star movie a copy of these four hit films?: 'ఫ్యామిలీ స్టార్' కథ కోసం నాలుగు హిట్ సినిమాలను దర్శకుడు పరశురామ్ కాపీ చేశాడా? ఆ విమర్శలకు కారణం ఏమిటి? చూడండి.
Decoding Family Star script, influence of old Telugu movies: 'ఫ్యామిలీ స్టార్' రిలీజ్ అయ్యాక మూవీపై ట్రోల్స్, సెటైర్స్ గట్టిగా వస్తున్నాయ్. సినిమా తీయడానికి కథ ఉండాలా ఏంటి? అంటూ ఒకరు, కామన్ మ్యాన్ గురించి ఈ మాత్రం చెప్పే దానికి సినిమాయే తీయాలా ఏంటి? పుస్తకం రాస్తే సరిపోద్దిగా అంటూ ఇంకొకరు... ఒక్కొక్కరూ ఒక్కోలా ట్రోల్ చేస్తున్నారు. రివ్యూస్, రిజల్ట్ సంగతి పక్కన పెడితే... డైరెక్టర్ పరశురామ్ రైటింగ్ మీద ఎక్కువ విమర్శలు వచ్చాయి. పాత కథను కొత్తగా చెప్పడంలో ఫెయిల్ అవ్వడమే కాదు, పాత సినిమాలను మిక్సీలో వేసి దొరికిపోయాడు.
ఫస్టాఫ్ అంతా గ్యాంగ్ లీడరేగా బాసూ!
Family Star movie first half is copy of Chiranjeevi's Gang Leader movie?: హీరో క్యారెక్టరైజేషన్, బ్రదర్స్ రిలేషన్, హీరో ఇంటి మీదకు హీరోయిన్ దిగడం... 'ఫ్యామిలీ స్టార్' ఫస్టాఫ్ మీద మెగాస్టార్ చిరంజీవి 'గ్యాంగ్ లీడర్' ఇన్ఫ్లూయెన్స్ చాలా ఎక్కువ ఉందని సినిమా చూసిన జనాల అభిప్రాయం.
'గ్యాంగ్ లీడర్' సినిమాలో అన్నదమ్ముల్లో చిరంజీవి చిన్నోడు. అన్నయ్యలో ఒకడు సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఇల్లు ఖాళీ చేయించడంతో, ఆ పని చేసిన చిరు ఇంటికి విజయశాంతి వస్తుంది. 'ఫ్యామిలీ స్టార్'కి వస్తే... విజయ్ దేవరకొండ చిన్నోడు. పెద్దన్నయ్య సివిల్స్ ప్రిపరేషన్‌లో ఉంటాడు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇంటి మీదకు అద్దెకు దిగుతుంది. స్టోరీ లైన్ చూస్తే సిమిలారిటీస్ ఉన్నాయి. అందుకే కాపీ అంటున్నారు.
ఇంటర్వెల్ ట్విస్ట్ తప్పిస్తే సెకండాఫ్ కాపీ!
'గ్యాంగ్ లీడర్' ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లూయెన్స్ ఫస్టాఫ్ మీద ఎంత అనేది పక్కన పెడితే... ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు చిన్నపాటి కిక్ ఇచ్చింది. ఆ తర్వాత సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక మళ్లీ కాపీ ట్రాక్ కనిపించింది.
హీరో ఆర్కిటెక్ట్. హీరోయిన్ పొజిషన్ అతడి కంటే పెద్దది. హీరోయిన్ కింద హీరో పని చేయాల్సి వస్తుంది. బ్రేకప్ కావడంతో ఇష్టం లేక వెళ్లిపోదామని అనుకుంటే కొన్ని పరిస్థితుల వల్ల కుదరదు. చివరకు హీరో కట్టిన ఇంటి డిజైన్ అందరికీ నచ్చేస్తుంది. ఈ ట్రాక్ చదువుతుంటే వరుణ్ తేజ్, రాశీ ఖన్నాల 'తొలిప్రేమ' గుర్తుకు వచ్చిందా? 'ఫ్యామిలీ స్టార్' సినిమాలోనూ సేమ్ టు సేమ్ అటువంటి ట్రాక్ కాసేపు ఉంటుంది. థీసిస్ కంప్లీట్ చేసిన డబ్బున్న హీరోయిన్ మిడిల్ క్లాస్ గురించి చెబుతుంటే కత్రినా కైఫ్ 'మల్లీశ్వరి' సీన్, క్లైమాక్స్ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ 'జల్సా'ను గుర్తు చేశాయని ఆడియన్స్ అంటున్నారు. 'ఫ్యామిలీ స్టార్'లో కన్నడ యాక్టర్ అచ్యుత్ కుమార్, ఆయన కొడుకు - 'జల్సా'లో ముఖేష్ రుషి, ఆయన కొడుకు... వాళ్లతో హీరోయిన్ కనెక్షన్... సిమిలారిటీస్ ఉన్నాయనేది ఫ్యాన్స్ ఫీలింగ్. యాజిటీజ్ కాపీ చెయ్యకుండా ఛేంజెస్ చేశారు.
Also Read: మళ్ళీ దొరికేసిన తమన్... ఎన్టీఆర్ పాటకు రామ్ చరణ్ 'జరగండి' కాపీ!?
'గీత గోవిందం' సక్సెస్ తర్వాత పరశురామ్ మీద విజయ్ దేవరకొండ నమ్మకం పెట్టుకునే దాన్ని వమ్ము చేశాడని, కాపీ కథతో తమ హీరోకి ఫ్లాప్ ఇచ్చాడని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ మీద కోపడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఫస్ట్ డే కలెక్షన్స్ బావున్నాయి. అయితే, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన ఫిల్మ్ ఇదైతే కాదు. రామ రామ... ఏంటిది పరశురామా... ఒక్క కథ కోసం ఇన్ని సినిమాలను మిక్సీలో వేసి కిచిడీ చేయాలా? కథ రాయాలంటే కాపీయే చెయ్యాలా ఏంటి? కొత్త థాట్స్ రావా?
Also Read: సాయి ధరమ్ తేజ్ హీరోయిన్‌తో షారుఖ్ కొడుకు డేటింగ్ - ప్రూఫ్స్ తో బయటపెట్టిన నెటిజన్!