Manjummel Boys OTT: ఓటీటీకి రాబోతున్న బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!
Manjummel Boys OTT: మలయాళ బ్లాక్‌బాస్టర్ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఓటీటీకి రిలీజ్‌కు రెడీ అవుతుంది. నెల రోజుల ముందే ఈ సినిమా తెలుగు వెర్షన్ ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్‌కి రానుందట.

Manjummel Boys Movie OTT Platform and Streaming Date Details: ఈ మధ్య భాషతో సంబంధం అన్ని సినిమాలు అన్ని భాషల్లోనూ సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా మలయాళ చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. తెలుగులో డబ్బింగ్ కాకపోయినా సబ్ టైటిల్స్‌తోనే చూసి ఇక్కడ హిట్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణ రీసెంట్‌గా వచ్చిన 'ప్రేమలు', ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలే. ప్రేమలు మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. తెలుగులో కూడా మలయాళ భాషలోనే ఆడియన్స్ ఆదరణ పొందింది. ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ 'ప్రేమలు'ను ఎస్‌ఎస్ రాజమౌళి తనయుడు తెలుగులో రిలీజ్ చేశారు. కార్తికేయ ఈ సినిమాను తెలుగులో సమర్పించగా ఇక్కడ మంచి ఆదరణ పొందింది. ఇదే మూవీ బాటలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా వచ్చేసింది.
రీసెంట్‌గా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి రికార్డు సెట్ చేసింది. తెలుగు వెర్షన్ కంటే ముందే ఇక్కడ ‘మంజుమ్మెల్ బాయ్స్’ హిట్ అయ్యింది. కేవలం సబ్ టైటిల్స్‌తోనే మూవీ చూసి హిట్ చేశారు. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ ‘మంజుమ్మెల్ బాయ్స్’ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది. ఏప్రిల్ 6న థియేటర్లోకి థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ తెలుగు వెర్షన్‌లో త్వరలో ఓటీటీలోకి రాబోతుందట.
‘మంజుమ్మెల్ బాయ్స్’ ఓటీటీ రైట్స్‌ను డిస్ని ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. మంచి ఫ్యాన్సీ డీల్‌కు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇక తెలుగు థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ చేసేందుకు హాట్‌స్టార్ సన్నాహాలు చేస్తోంది. తెలుగుతో పాటు మలయాళ భాషలో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. మే 3న ‘మంజుమ్మెల్ బాయ్స్’ను ఓటీటీలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై హాట్‌స్టార్ నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
కథేంటంటే!
‘మంజుమ్మెల్ బాయ్స్’ అనేది నిజ జీవితం సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. చిదంబరం S. పొదువల్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. కేరళకు చెందిన కొందరు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్‌కు వెళతారు. అక్కడ దేవాలయం దర్శనం అనంతరం గుణ కేవ్స్ (కమల్ హాసన్ హీరోగా నటించిన 'గుణ' సినిమాలో చూపించిన గుహలు) వద్దకు వెళతారు. అయితే అక్కడ ఆ స్నేహితుల బృందంలోని ఒకరు మిస్ అవుతాడు. అక్కడి గుహల్లో పడిపోయిన అతడి కోసం మిగతా వారంత వెతుకుతారు. ఈ క్రమంలో ఆ గుహలో పడిపోయిన మనుషులు ఇంతవరకు ప్రాణాలతో బయటపడిన దాఖలాలు లేవని, శవం కాదు కదా.. ఎముకలు దొరకవంటూ సమీపంలో ప్రజలంతా వారిని హెచ్చరిస్తారు. అయినా కానీ తమ స్నేహితుడి కాపాడాలని వారంత ధైర్యంతో అక్కడే ఉండి అతడిని వెతుకుతారు. ఈ క్రమంలో వారికి ఎదురైన ఊహించని సంఘటనలు, పరిణామాల చూట్టూ ఈ సినిమా సాగుతుంది. మరి చివరికి వారికి స్నేహితుడు దొరికాడా? అసలు అతడు బ్రతికాడా? లేదన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

