అన్వేషించండి

Thangalaan OTT: 'తంగలాన్' ఓటీటీ రిలీజ్‌కు తొలగిన అడ్డంకి... బ్యాన్ ఎత్తేసిన కోర్టు, ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

విక్రమ్ 'తంగలాన్' మూవీ ఓటిటి రిలీజ్ కు అన్నీ అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా ఈ మూవీకి లైన్ క్లియర్ కాగా, 'తంగలాన్' ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోందో తెలుసుకుందాం పదండి.

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన పాన్ ఇండియా మూవీ 'తంగలాన్'కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. కానీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో మాత్రం అడ్డంకులను ఎదుర్కొంటుంది. ఓ వివాదం కారణంగా ఈ సినిమాపై కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది.

'తంగలాన్' వివాదం ఏమిటంటే?
చియాన్ విక్రమ్ హీరోగా, పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'తంగలాన్'. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలో విక్రమ్ ఐదు విభిన్న పాత్రల్లో కనిపించారు. సినిమాలో విక్రమ్ తో పాటు పశుపతి, మాళవిక మోహనన్, డేనియల్ కాల్టాగిరోన్, హరికృష్ణన్, పార్వతీ తిరువోతు తదితరులు నటించారు. జివి ప్రకాష్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందించగా, కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ బంగారు క్షేత్రంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా 'తంగలాన్'ను తెరకెక్కించారు. విక్ర, పార్వతి, మాళవిక నటన ఈ సినిమాలో హైలెట్ అని చెప్పవచ్చు. అయితే థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడిన ఈ సినిమా ఓటిటి విషయం వచ్చేసరికి రిలీజ్ ఆగిపోయింది. అయితే తిరువళ్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజా ప్రయోజన పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు వైష్ణవులను కించపరిచే విధంగా ఉన్నాయని, బౌద్ధాన్ని పవిత్రంగా, వైష్ణవాన్ని జోక్‌గా చూపించిన సీన్స్ వల్ల ఓటీటీలో రిలీజ్ చేస్త ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా బ్యాన్ చేయాలని ఆ పిటిషన్ లో కోరారు.

బ్యాన్ చేయలేమన్న కోర్టు
తాజా సమాచారం ప్రకారం ఎట్టకేలకు కోర్టు ఈ సినిమాపై నిషేధాన్ని ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ కాబోతోంది. తాజాగా పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీరామ్‌, జస్టిస్‌ సెంథిల్‌ కుమార్‌ రామ్‌మూర్తి బెంచ్ సినిమా సెన్సార్‌ సర్టిఫికేట్‌ వచ్చాకే రిలీజ్ అయ్యింది కాబట్టి ఓటీటీ రిలీజ్ చేసేందుకు ఎలాంటి అడ్డంకి లేదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాను నిశితంగా పరిశీలించిన తర్వాతే సర్టిఫికేషన్ జారీ చేసిందని తెలుపుతూ బ్యాన్ చేయలేమని వెల్లడించింది కోర్టు. 

ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
ఇటీవల ఒక కార్యక్రమంలో 'తంగలాన్' నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ మూవీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుందని హింట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ దీపావళికి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ వారు షెడ్యూల్ చేశారని చెప్పుకొచ్చారు. 'తంగలాన్' పెద్ద సినిమా కాబట్టి పండగకు రిలీజ్ చేయబోతున్నారని, అయితే బయట సినిమాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి అంటూ వస్తున్న వార్తలు ఆ వాస్తవమని కొట్టి పారేశారు. కానీ ఇంకా ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Thiruppavi pasuralu: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
ధనుర్మాసం స్పెషల్: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
Embed widget