News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

సమంత ఇంట్లోకి మరో పెంపుడు జంతువు గెలాటో వచ్చేసింది

ఇటీవలే సినిమాలకు విరామం ప్రకటించిన సమంత.. ఇప్పుడు చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్దంగా ఉంది. అయితే తాజాగా తన ఇంట్లోకి మరో పెంపుడు జంతువు వచ్చిందంటూ... ఆమె ఓ పిల్లి (గెలాటో) ఫొటోను షేర్ చేసింది.

FOLLOW US: 
Share:

స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కు పెంపుడు జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె దగ్గర ఓ కుక్క పిల్లలు ఉన్నాయి. వాటితో గడుపుతున్న ఫొటోలు, వీడియోలను గతంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అంతే కాదు... వాటికి బర్త్ డేలు సెలబ్రేట్ చేస్తూ... ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. సమంత దగ్గర హాష్, సాషా అనే పెంపుడు కుక్కలు ఉండగా... ఇప్పుడు మరో పెంపుడు జంతువు కూడా వచ్చి చేరింది. పెంపుడు జంతువులను సైతం ఫ్యామిలీగా భావించే సామ్ ఇంట్లోకి వచ్చిన ఆ మరో ఫ్యామిలీ మెంబర్ ఎవరంటే....

సమంత ఇంట్లో గెలాటో!
ఇప్పటి వరకూ ఉన్న కుక్కలతో తోడు ఓ పిల్లిని ఇంట్లోకి తెచ్చుకుంది సామ్. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. దాంతో ఓ క్యూట్ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో ఎలాంటి ఫిల్టర్ లేకుండా ప్రశాంతమైన మోముతో.. ఎరుపు రంగు ప్రింటెడ్ నైట్ సూట్ ధరించిన సమంత... ఓ పిల్లిని కౌగిలించుకుంటూ కనిపించారు. ఈ ఫొటోతో పాటు 'గెలాటో మార్నింగ్ టు యు' అని క్యాప్షన్ లో రాసుకువచ్చింది. అంటే ఈ పిల్లి పేరు గెలాటో అన్న మాట. ఇక ఈ పోస్టుపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. క్యూట్ నెస్ ఓవర్ లోడ్ అయినట్టుగా కనిపిస్తోన్న ఈ ఫొటోను చూసిన ఆమె ఫ్యాన్స్.. మీ ఇద్దరికీ శుభోదయం అని చెబుతున్నారు. 'గెలాటో రావడంతో హష్, సాషా రియాక్షన్ ఏంటి?' అని కొందరు అడగగా... 'వాళ్లెక్కడ ఉన్నారు? గెలాటో గురించి జెలసీతో ఉన్నారా? వారిద్దరూ మీతో ఆ గెలాటో ఉండడాన్ని ఒప్పుకుంటున్నారా?' అంటూ చమత్కారమైన కామెంట్లు పెడుతున్నారు. 'మీకు కిట్టీ దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నా'నంటూ ఇంకొకరు రిప్లై ఇచ్చారు.

View this post on Instagram
 
A post shared by Samantha (@samantharuthprabhuoffl)

చైతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య పుట్టిన రోజున సమంత ఎలాంటి విషెస్ చెప్పలేదు. ఇక అదే రోజు తన పెంపుడు జంతువు హాష్ పుట్టిన రోజు కావడంతో... దానికి బర్త్ డే విషెస్ చెప్పడంతో పాటు ఆ రోజు సెలబ్రెట్ చేసుకున్న ఫొటోలను కూడా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్లు పెట్టారు. 'నాగ చైతన్యకు విషెస్ చెప్పకుండా జంతువుకు మాత్రం అవసరమా?' అని విమర్షించారు. 'ఓ ఫ్రెండ్ గానైనా అతన్ని విష్ చేయకపోవడం చాలా బాధాకరం' అంటూ మరికొందరు తమ బాధను వ్యక్తం చేశారు.

ఇక సమంత సినిమా విషయాలకొస్తే... ఇటీవలే 'సిటాడెల్' షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె, మయోసైటిస్ అనంతరం ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను నివారించేందుకు సినిమాలకు కొంత కాలం విరామం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. త్వరలోనే చికిత్స కోసం విదేశాలకు బయల్దేరనున్నట్టు సమాచారం. ఇక మొన్నటి వరకూ సినిమాలు, షూటింగ్ లంటూ బిజీగా గడిపిన సమంతకు ఇప్పుడే కాస్త టైం దొరికింది. కాబట్టి ఈ గ్యాప్ లో పలు పుణ్య క్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల కోయంబత్తూర్ లోనే ఈషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమానికి హాజరైంది. 

Read Also : లవ్ స్టోరీ చెప్పమంటే, ఏకంగా ఇద్దరు పిల్లలున్నారని చెప్పి షాక్ ఇచ్చిన ఈషా రెబ్బా

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 20 Jul 2023 04:15 PM (IST) Tags: Samantha Ruth Prabhu Cat Citadel Samantha New Pet Gelato Hash Sash Samantha New Pet

ఇవి కూడా చూడండి

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Antony: మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

Vijay Antony:  మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

టాప్ స్టోరీస్

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?