New Year - Liquor Sales : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
New Year - Liquor Sales : కొత్త ఏడాదికి సిద్ధమవుతోన్న వేళ రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ ఇచ్చింది. డిసెంబర్ 31న తెలంగాణలో మద్యం దుకాణాలను అర్థరాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ప్రకటించింది.

New Year - Liquor Sales : ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సమాయత్తం అవుతోంది. అనేక దేశాలు వాటిల్లోని రాష్ట్రాల ప్రజలు ఈ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ కి ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలా అని ప్రణాళికలు రచిస్తున్నారు. కొత్త సంవత్సరం అనగానే గుర్తొచ్చేది సెలబ్రేషన్స్. దాంతో పాటు లిక్కర్ సేల్స్. ఈ రోజున మద్యం ఏరులై పారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ముఖ్యంగా తెలంగాణలో అయితే ఏ పండుగ అయినా, పర్వదినమైనా.. పుట్టినా, చచ్చినా.. మందు లేకపోతే ఆ కార్యక్రమం పూర్తి కాదు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని అధికారులు ఎప్పటిలాగే కొన్ని ఆంక్షలు విధిస్తారు. మరికొన్ని సడలిస్తూ ఉంటారు. అదే తరహాలో ఈ సారీ మందుబాబులకు కిక్కిచ్చే వార్త ఒకటి చెప్పారు. డిసెంబర్ 31న తెలంగాణలో మద్యం దుకాణాలను అర్థరాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ప్రకటించారు.
నూతన సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు, కొనుగోళ్లపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్థరాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ప్రకటించింది. దీంతో న్యూయర్ ను లిక్కర్ పార్టీతో వెల్కమ్ చెప్పాలనుకునేవారికి మద్యం దొరకదనే సమస్య తీరినట్లే. ఇక బార్లు, రెస్టారెంట్స్ ను అర్థరాత్రి 1గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈవెంట్స్ ను రాత్రి 1గంటలకు పరిమితం చేసింది. దీనిపై ప్రభుత్వం స్వయంగా జీవో జారీ చేసింది.
డ్రగ్స్ పై ఉక్కుపాదం
దేశంలో డ్రగ్స్ మాఫియా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, తీసుకున్నా, తమ దగ్గర ఉంచుకున్నా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. డ్రగ్ రహిత సెలబ్రేషన్స్ జరుపుకోవాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఈవెంట్స్, పార్టీలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించింది. ఎప్పటిలాగే ఈ సారీ మద్యం కొనుగోళ్లతో ప్రభుత్వం ఖజానా నిండుతుందని అధికారులు భావిస్తున్నారు.
‘క్యూ ఆర్’ కోడ్‌తో మద్యం విక్రయాలు
రాష్ర్టవ్యాప్తంగా న్యూ ఇయర్ సందడి కొనసాగుతోన్న వేళ.. ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టాస్మాక్ సంస్థ దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. అయితే మద్యం విక్రయాల్లో దుకాణాల సిబ్బంది చేతివాటం ప్రదర్శించి బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అధికంగా వసూలుచేస్తున్నట్లు ఫిర్యాదులందాయి. వీటిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. టాస్మాక్ దుకాణాల్లో డిజిటల్ విధానంలో విక్రయాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

