Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Sahiba Music Video Song: విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ ‘సాహిబా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది. ఆకట్టుకునే మ్యూజిక్, విజయ్, రాధిక కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.
Vijay Deverakonda Sahiba Full Song: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ ‘సాహిబా’ విడుదల అయ్యింది. బాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ జస్లీన్ రాయల్ కంపోజ్ చేసిన ఈ పాట ముందుగా ప్రకటించినట్లుగానే ఇవాళ 12 గంటలకు విడుదల చేశారు. వినసొంపైన సంగీతం, విజయ్, రాధిక మధ్య విజువలైజేషన్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
ఆకట్టుకుంటున్న ‘సాహిబా’ సాంగ్
సుధాన్షు సరియా దర్శకత్వం వహించిన ‘సాహిబా’ మ్యూజిక్ ఆల్బమ్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్ గా కనిపించారు. విజయ్, రాధిక మదన్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటున్నది. వింటేజ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది. సరికొత్త సంగీత శైలి, భావోద్వేగాలతో జస్లీన్ వీక్షకులను అలరించింది. ఈ పాట మ్యూజిక్ లవర్స్ మదిలో నిలిచిపోయేలా జస్లీన్ రూపొందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నది.
‘హీరియే..’ను మించి చార్ట్ బస్టర్ గా..
గత కొద్ది రోజుల క్రితం సింగర్ జస్లీన్ విడుదల చేసిన ‘హీరియే’ ఆల్బమ్ అద్భుతంగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ ను అద్భుతంగా ఆకట్టుకుంది. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ‘సాహిబా’తో మళ్లీ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తోంది. విజయ్ దేవరకొండ, రాధిక మదన్ కెమిస్ట్రీ మరో లెవెల్ లో ఉంది. ఈ ఆల్బమ్ ‘హీరియే..’ సాంగ్ ను మించి హిట్ అవుతుందని విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.
విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీస్ ఏమున్నాయంటే?
అటు విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే... మాంచి హిట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ’ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాలు అందుకోలేదు. ఆ సినిమాల మీద విజయ్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఫ్యాన్స్‌ను మెప్పించిన ఆ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో కాస్త బ్రేక్ తీసుకున్న విజయ్.. ప్రస్తుతం వరుస సినిమాలకు ఓకే చెప్తున్నారు. ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో కలిసి విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లోనూ ఓ మూవీకి ఓకే చెప్పారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీ చేబోతున్నారు. ఈ సినిమాలో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని ఆయన భావిస్తున్నారు. వరుస ఫ్లాపుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Thank you for giving so much love to #Sahiba's first look!
— Jasleen Royal (@jasleenroyal) November 10, 2024
To all the old school romantics we have a surprise coming for you tomorrow. 11/11🌹
Stay tuned
P.s. Homie imitating Vd's style 😍🐾@TheDeverakonda @radhikamadan01 pic.twitter.com/5w9G82NuHC
Read Also: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్