Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Renu Desai: పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. తాజాగా పవన్, ఆన్నా ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
![Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్ Renu Desai shares photo of Pawan Kalyan and Anna and uploads an emotional post Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/6846917063c5a3a51f2bf8fbf88804401719334994233239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Renu Desai: సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా యాక్టివ్‌గా ఉండడం వల్ల రేణు దేశాయ్‌పై ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ ఎక్కువయిపోతున్నాయి. చాలావరకు వాటిపై రేణు స్పందిస్తూనే ఉన్నారు. అలాంటి కామెంట్స్ చేయకండి అని చెప్తూనే ఉన్నారు. దీంతో ఆమె కొన్ని పోస్టులకు కామెంట్స్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసింది. అయినా కొందరు ఆకతాయిలు ఆమె కామెంట్స్ ఆఫ్ చేయని పోస్ట్‌లను వెతికి మరీ నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు. వాటిపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్, ఆన్నా ఉన్న ఫ్యామిలీ ఫోటోను ఆమె షేర్ చేశారు. కొన్నిరోజుల క్రితం పవన్, అకిరా కలిసి మోదీని కలవడానికి వెళ్లినప్పుడు ఆన్నా కూడా అక్కడే ఉన్నా ఆ ఫోటోను రేణు ఎడిట్ చేశారని చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమె స్పందించారు.
అది మర్చిపోకండి..
‘‘నేను ఆ ఫోటోను క్రాప్ చేసి పోస్ట్ చేస్తాను అని మీమ్స్ చేసి ఇష్టం వచ్చినట్టు జోక్స్ వేస్తున్న జ్ఞానంలేని మనుషులకు నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే. మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఈరోజు ఉదయం తన తల్లిపై జోకులు వేస్తూ వచ్చిన ఒక మీమ్ చూసి నా కూతురు చాలా ఏడ్చింది. మీరందరూ రాజకీయ నాయకులు, సెలబ్రిటీల కుటుంబాల గురించి జోకులు వేస్తారు. కానీ మీకు కూడా ఇంట్లో అమ్మ, అక్క, కూతురు అనేవాళ్లు ఉంటారని మర్చిపోకండి. కేవలం ఇంటర్నెట్‌కు, ఇతర సెలబ్రిటీల సోషల్ మీడియా యాక్సెస్ ఉండడం వల్ల జ్ఞానం కోల్పోతున్న మనుషులను చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది’’ అని వాపోయారు రేణు దేశాయ్.
శాపం తగులుతుంది..
‘‘ఈరోజు నా కూతురు పడిన బాధ, తన కన్నీళ్లు మీకు కర్మలాగా రివర్స్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. ఆన్నా పిల్లలు పోలినా, మార్క్ కూడా మీ మీమ్స్, కామెంట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతారు. మీమ్ పేజీల క్రియేటర్స్ అనేవాళ్లు చాలా దారుణమైన మనుషులు. ఒక తల్లి శాపం మీకు తగులుతుంది. ఇది పోస్ట్ చేయడానికి నేను 100 సార్లు ఆలోచించాను. కానీ నా కూతురు పడిన బాధకోసం పోస్ట్ చేస్తున్నాను’’ అని తెలిపారు రేణు దేశాయ్. ఇలా ఫోటోను పోస్ట్ చేసి తన అభిప్రాయాన్ని పంచుకున్న తర్వాత దీనికి ఆమె కామెంట్స్ ఆఫ్ చేశారు. దీంతో ఒక నెటిజన్.. తన కామెంట్స్ ఆన్ ఉన్న పోస్ట్‌ను వెతుక్కుంటూ వెళ్లి కామెంట్ చేయగా.. దానిని కూడా రేణు షేర్ చేశారు.
View this post on Instagram
పిచ్చిదానివి..
‘‘మీరు ఈమధ్య ప్రతీదానికి రియాక్ట్ అవుతూ దానిని స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంటే నాకొక పిచ్చిదానిలాగా కనిపిస్తున్నారు. మీ ఆలోచనా విధానం మార్చుకోండి. లైట్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వండి’’ అంటూ ఒక అమ్మాయి సలహా ఇచ్చింది. దీనిని రేణు దేశాయ్.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ దీనిపై రియాక్ట్ అయ్యారు. ‘‘వాళ్లు నన్ను పిచ్చిదాన్ని అని పిలవడానికి నా పోస్టులను వెతుక్కుంటూ వస్తున్నారు. నా బాధ, నా పిల్లల బాధ మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఏదో ఒకరోజు నాకు మనశ్శాంతి దొరుకుతుంది’’ అని అన్నారు రేణు దేశాయ్.
Also Read: మీ అమ్మ నిన్ను ఇలాగే పెంచిందా? నేను మిమ్మల్ని నాశనం చేయగలను - రేణు దేశాయ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)