Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ మూవీకి మాజీ ఉపరాష్ట్రపతి ప్రశంసలు - అంతర్జాతీయ స్థాయి సినిమా అంటూ పోస్ట్
Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సినిమా చూసి చిత్ర బృందాన్ని అభినందించారు.
![Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ మూవీకి మాజీ ఉపరాష్ట్రపతి ప్రశంసలు - అంతర్జాతీయ స్థాయి సినిమా అంటూ పోస్ట్ Former Vice President M Venkaiah Naidu praises Prabhas Kalki 2898 AD movie cast and crew Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ మూవీకి మాజీ ఉపరాష్ట్రపతి ప్రశంసలు - అంతర్జాతీయ స్థాయి సినిమా అంటూ పోస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/18/a5075a5acf692f97b0793219eee408cd1721321012709686_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. మూడో వారంలోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇండియన్ మైథాలజీకి ఫ్యూచర్ వరల్డ్ ను ముడిపెడుతూ నాగి ఈ సినిమాని రూపొందించారు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు చిత్ర బృందాన్ని అభినందించగా.. తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈ మూవీ చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
'కల్కి 2898 ఏడీ' సినిమా మంచి అనుభూతిని కలిగించిందని, ఇదొక ఇంటర్నేషనల్ స్థాయి మూవీ అని వెంకయ్య నాయుడు ఎక్స్ లో పోస్ట్ చేసారు. ''శ్రీ నాగ్ అశ్విన్ గారి దర్శకత్వంలో శ్రీ అశ్వినీ దత్ గారు నిర్మించిన ‘కల్కి 2898 ఎ.డి’ చలనచిత్రాన్ని ఈరోజు వీక్షించాను. మహాభారత ఇతిహాసం స్ఫూర్తితో, మహాభారతంలోని పాత్రలతో రూపొందించిన ఈ ఫిక్షన్ థ్రిల్లర్ మంచి అనుభూతిని కలిగించింది. సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఈ సినిమాని నిర్మించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణే తదితర భారీ తారాగణంతో రూపొందించిన ఈ చలనచిత్ర నిర్మాణం హాలీవుడ్ నిర్మాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా. దర్శకుడు శ్రీ నాగ్ అశ్విన్, నిర్మాత శ్రీ అశ్వినీ దత్ సహా ఈ చలనచిత్ర రూపకల్పనలో పాల్పంచుకున్న భాగస్వాములందరికీ అభినందనలు.'' అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
శ్రీ నాగ్ అశ్విన్ గారి దర్శకత్వంలో శ్రీ అశ్వినీ దత్ గారు నిర్మించిన కల్కి 2898 ఎ.డి చలనచిత్రాన్ని ఈరోజు వీక్షించాను. మహాభారత ఇతిహాసం స్ఫూర్తితో , మహాభారతంలోని పాత్రలతో రూపొందించిన ఈ ఫిక్షన్ థ్రిల్లర్ మంచి అనుభూతిని కలిగించింది. సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఈ సినిమాని నిర్మించారు.… https://t.co/ixzRzpEQkj
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) July 18, 2024
‘కల్కి 2898 AD’ సినిమా జూన్ 27న తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదలైంది. తొలి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రం.. కేవలం 14 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన 7వ భారతీయ సినిమాగా నిలిచింది. అదే సమయంలో 'బాహుబలి' తర్వాత మరోసారి ఈ అరుదైన ఘనత సాధించిన ఇండియన్ యాక్టర్ గా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకముందు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ 'పఠాన్' 'జవాన్' సినిమాలతో రెండుసార్లు వెయ్యి కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ‘కల్కి 2898 AD’ సినిమా మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రముఖ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’లో అత్యధిక టికెట్లు అమ్ముడైన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇప్పటివరకూ ‘జవాన్’ మూవీ 12.01 మిలియన్ టికెట్లతో టాప్ లో ఉండగా.. ఇప్పుడు ప్రభాస్ సినిమా 12.15 మిలియన్లకు పైగా టికెట్లతో ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. 'భారతీయుడు 2' 'సర్ఫిరా' చిత్రాలకు మిశ్రమ స్పందన రావడం, మరికొన్ని రోజుల వరకూ పెద్ద సినిమాలేవీ థియేటర్లలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో.. కల్కి మూవీ మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'కల్కి 2898 ఏడీ' చిత్రంలో బౌంటీ హంటర్ భైరవ పాత్రలో నటించారు ప్రభాస్. క్లైమాక్స్ లో కర్ణుడిగా కనిపించి సెకండ్ పార్ట్ పై ఆసక్తిని కలిగించారు. అశ్వత్ధామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ నటించారు. దీపికా పదుకునే, దిశా పఠానీ కథానాయికలుగా నటించగా.. శోభన, పశుపతి, అన్నాబెన్, శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్. ఎస్.ఎస్. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ తదితరులు అతిథి పాత్రల్లో మెరిశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.
Also Read: పాపం రకుల్.. అటు భర్త, ఇటు తమ్ముడు - పెళ్లి తర్వాత అన్నీ కష్టాలే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)