అన్వేషించండి

Rakul Preet Singh: పాపం రకుల్.. అటు భర్త, ఇటు తమ్ముడు - పెళ్లి తర్వాత అన్నీ కష్టాలే!

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ కు ఇటీవల కాలంలో ఏదీ కలిసి రావడం లేదు. ఇటు సినిమాల్లోనూ, అటు వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 

Rakul Preet Singh: కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా రాణించింది అందాల రకుల్ ప్రీత్ సింగ్. అగ్ర హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకూ.. అందరితో జోడీ కట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంది. అయితే వరుసగా పరాజయాలు పలకరించడంతో తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో బాలీవుడ్ కు చెక్కేసి హిందీలో క్రేజీ ఆఫర్లు దక్కించుకుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆమెకు ఏదీ పెద్దగా కలిసి రావడం లేదు. అటు పర్సనల్ గా, ఇటు ప్రొఫెషనల్ గా గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 

భర్త నిర్మించిన సినిమా ఫ్లాప్

రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత జాకీ భగ్నానిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో తన ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే ఇటీవల తన భర్త నిర్మించిన 'బడే మియాన్ చోటే మియాన్' సినిమా దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. దీంతో కంపెనీకి దాదాపు రూ.250 కోట్ల వరకూ నష్టాలు వచ్చాయని, దివాళా తీసే పరిస్థితి వచ్చిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. 

‘భారతీయుడు 2’ ఎదురుదెబ్బ

'బడే మియాన్ చోటే మియాన్' సినిమాకి వర్క్ చేసిన సిబ్బందికి, తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా వాషు భగ్నాని ఫ్యామిలీ ఇబ్బంది పడిందని బాలీవుడ్ మీడియాలో నివేదికలు పేర్కొన్నాయి. దీంతో భర్తతో పాటుగా రకుల్ ప్రీత్ సింగ్ అనుకోని విధంగా వార్తల్లో నిలిచారు. ఇక సినిమాల పరంగానూ రకుల్ కు నిరాశే ఎదురైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'భారతీయుడు 2' చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది.

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఇండియన్ 2'. ఇందులో సిద్దార్థ్ తో పాటుగా రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాతో హిట్టు కొట్టి మళ్ళీ సౌత్ లో పాగా వేస్తుందని అభిమానులు భావించారు. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్, ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిడివి తక్కువ అయినా ఈ సినిమా విజయం సాధించి ఉంటే ఆమెకు కాస్త ఊరట లభించేది. కానీ అలా జరగలేదు.

డ్రగ్స్ కేసులో తమ్ముడు అరెస్ట్

ఇదిలా ఉండగానే సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ కావడంతో రకుల్‌ ప్రీత్ సింగ్ కు మరో పెద్ద షాక్‌ తగిలినట్లు అయింది. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్‌లోని అతని నివాసంలో రూ.2 కోట్ల విలువైన 2.6 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమన్ కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో, రకుల్ ప్రీత్ సింగ్ సైతం వార్తల్లో నిలిచింది.

గతంలో డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో రకుల్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించిన సంగతి తెలిసిందే. అలానే హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు సంబంధించిన డ్రగ్ కేసులో ఎన్సీబీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఇప్పుడు తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ సైతం డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో, రకుల్ మాదక ద్రవ్యాల కేసులో విచారణ ఎదుర్కొన్న విషయాలు మళ్ళీ వార్తల్లో వచ్చాయి. మరి త్వరలోనే రకుల్ ప్రీత్ సింగ్ వీటన్నిటి నుంచి బయట పడి సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తుందేమో చూడాలి.

Also Read: అల్లు శిరీష్ 'బడ్డీ' వాయిదా - రిలీజ్ ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget