అన్వేషించండి

Nag Ashwin: కల్కిగా కనిపించే హీరో ఎవరు? - డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏం చెప్పారంటే?

Nag Ashwin: ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంతోషాన్ని వ్యక్తం చేసారు.

Nag Ashwin: 'ఎవడే సుబ్రమణ్యం', 'మహానటి' చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇప్పుడు లేటెస్టుగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ఎపిక్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ.. గత గురువారం థియేటర్లలోకి వచ్చి, వరల్డ్ వైడ్ గా ఇప్పటికే రూ. 750 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. నాగ్‌ అశ్విన్‌ తాజాగా కల్కి సెట్ లో మీడియా మీట్ నిర్వహించారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. 

మైథాలజీని సైన్స్ ను ముడిపెడుతూ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని రూపొందించారు. హీరో ప్రభాస్ కాబట్టి ఆయనే కల్కిగా కనిపిస్తారని అందరూ భావించారు. కానీ సినిమాలో ప్రభాస్ ను బౌంటీ హంటర్ భైరవగా చూపించి, క్లైమాక్స్ లో కర్ణుడిగా ప్రెజెంట్ చేసారు. దీంతో కల్కిగా ఏ హీరో కనిపిస్తారని అందరూ ఆలోచిస్తున్నారు. ఇదే విషయాన్ని నాగ్ అశ్విన్ ను అడగ్గా.. ''కల్కి ఇంకా కడుపులోనే ఉన్నారు. అప్పుడే క్యాస్టింగ్ వరకూ వెళ్ళలేదు. దానికి ఇంకా చాలా టైం ఉంది'' అని సమాధానమిచ్చారు. 

'కల్కి' సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అంతేకాదు దీంట్లో బోలెడన్ని అతిథి పాత్రలున్నాయి. ఎస్.ఎస్ రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మాళవిక నాయర్, మృణాల్ ఠాకూర్ లాంటి కొందరు క్యామియో రోల్స్ చేసారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తొలిసారిగా బిగ్ స్క్రీన్ మీద కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసారు. అయితే ఆర్జీవీని ఎలా ఒప్పించారు? పార్ట్- 2లో ఆయన ఉంటారా? అని అడిగితే.. ఇప్పుడే చెప్పలేమని నాగ్ అశ్విన్ అన్నారు. 

''కల్కి పార్ట్-2లో ఆర్జీవీ ఉంటారో లేదో తెలియదు. ఆయనకు, రాజమౌళికి ఇది ట్రిబ్యూట్. ఫిలిం ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేసిన అలాంటి దర్శకులు నా సినిమాలో ఉంటే మరింత గొప్పగా ఉంటుందని అనుకున్నాను. ఆర్జీవీ ఇంతకముందు ఎప్పుడూ యాక్ట్ చెయ్యలేదు. 'అసలు నీ సినిమాలో నేను ఎందుకు ఉండాలి?' అని ఆయన నన్ను అడిగారు. 'కలియుగంలో మీరు ఉంటారనిపిస్తోంది. అందుకే సార్' అన్నాను. వెంటనే ఆయన షూటింగ్ కు వస్తానని చెప్పారు'' అని నాగ్ అశ్విన్ తెలిపారు. 

విజయ్‌ దేవరకొండ, మాళవిక నాయర్‌లను తాను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోకి తీసుకోవడం గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ తనకు లక్కీ ఛార్మ్స్ అనుకోవచ్చని నాగి చెప్పారు. ''ఫస్ట్ మూవీ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. వాళ్ళిద్దరితో కలిసి పనిచేయడం నాకు కంఫర్ట్‌గా ఉంటుంది'' అని అన్నారు. తన గత చిత్రాల్లో నటించిన నాని, నవీన్‌ పొలిశెట్టిని ఎందుకు తీసుకోలేదని అడగ్గా.. పార్ట్‌-1లో వాళ్ళను తీసుకునే అవకాశం దొరకలేదని, కానీ తర్వాత ఎక్కడ వీలుంటే అక్కడ వారిని పెట్టేస్తానని బదులిచ్చారు. ‘కల్కి 2898 AD’ లో దుల్కర్ సల్మాన్ క్యారక్టర్, కైరా బ్యాక్ స్టోరీలతో సపరేట్ గా సినిమాలు తీయొచ్చని నాగ్ అశ్విన్ అన్నారు. 

Also Read: నందమూరి కల్యాణ్ రామ్ ఎంతమంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Minister Satyakumar: 'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
Kali Movie Review - 'కలి' సినిమా రివ్యూ: చావు బ్రతుకుల మధ్య మనిషి ఆశతో దేవుడు ఆట ఆడితే?
'కలి' సినిమా రివ్యూ: చావు బ్రతుకుల మధ్య మనిషి ఆశతో దేవుడు ఆట ఆడితే?
Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP DesamIsrael attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP DesamIsrael attack in Beirut | లెబనాన్‌ యుద్ధ క్షేత్రంలో ABP News గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Minister Satyakumar: 'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
Kali Movie Review - 'కలి' సినిమా రివ్యూ: చావు బ్రతుకుల మధ్య మనిషి ఆశతో దేవుడు ఆట ఆడితే?
'కలి' సినిమా రివ్యూ: చావు బ్రతుకుల మధ్య మనిషి ఆశతో దేవుడు ఆట ఆడితే?
Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
Dhruv Sarja: దసరాకు 'మార్టిన్' చూడండి, టాలెంటెడ్ లేదనిపిస్తే ఎంకరేజ్ చేయకండి - అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా సెన్సేషనల్ కామెంట్స్
దసరాకు 'మార్టిన్' చూడండి, టాలెంటెడ్ లేదనిపిస్తే ఎంకరేజ్ చేయకండి - అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా సెన్సేషనల్ కామెంట్స్
Youtube Mistake: తప్పు చేసిన యూట్యూబ్ - ఎన్నో ఛానెళ్లు అవుట్!
తప్పు చేసిన యూట్యూబ్ - ఎన్నో ఛానెళ్లు అవుట్!
Jio Diwali Plan: 12 ఓటీటీ యాప్స్ అందించే ప్లాన్ లాంచ్ చేసిన జియో - రూ.450లోపే!
12 ఓటీటీ యాప్స్ అందించే ప్లాన్ లాంచ్ చేసిన జియో - రూ.450లోపే!
Nissan Magnite Facelift: బడ్జెట్ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర రూ.ఆరు లక్షల్లోపే!
బడ్జెట్ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర రూ.ఆరు లక్షల్లోపే!
Embed widget