Aashram Latest Series OTT Release Date: ఆశ్రమంలో అత్యాచారం, హత్యల వెనుక మిస్టరీ - బాబా బండారం బయటపడిందా?.. ఆ ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఎప్పటి నుంచంటే?
Aashram OTT Platform: బాబీ డియోల్ దొంగ బాబా పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఆశ్రమ్. తాజాగా ఈ సిరీస్ సీజన్ 3 పార్ట్ 2 ఈ నెల 27 నుంచి 'అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Bobby Deol's Aashram Season 3 Part 2 Web Series OTT Release On MX Player: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, సిరీస్ అంటేనే మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడతారు. వారి ఇంట్రెస్ట్‌కు అనుగుణంగానే పలు ఓటీటీలు ఎక్కువగా క్రైమ్, హారర్, థ్రిల్లర్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఆ కోవలోకి చెందింది 'ఆశ్రమ్' (Aashram) వెబ్ సిరీస్. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ నెగిటివ్ రోల్‌లో నటించిన ఈ సిరీస్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఇప్పటికే అలరించాయి. తాజాగా, ఈ సిరీస్ సీజన్ 3 పార్ట్ 2 ను ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ ఫ్రీ ఓటీటీల్లో ఒకటైన ఎంఎక్స్ ప్లేయర్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇటీవలే ఓ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. అంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ సిరీస్‌పై హైప్‌ను పెంచేసింది.
'ప్రకాష్ ఝా' దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 2020లో సీజన్ 1, సీజన్ 2.. 2022లో సీజన్ 3 'ఎంఎక్స్ ప్లేయర్'లో రిలీజ్ అయ్యింది. ఇటీవలే అమెజాన్ కొనుగోలు చేయగా.. 'అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్' (Amazon MX Player) గత 3 సిరీస్‌లతో పాటు తాజా సిరీస్ సీజన్ 3 పార్ట్ 2 కూడా చూడొచ్చు. బాబీ డియోల్ బాబా నిరాలా అనే ఓ దొంగ బాబా పాత్రలో నటించిన బోల్డ్ వెబ్ సిరీస్ 'ఆశ్రమ్'. గతంలో వచ్చిన సీజన్లలో బాబా తనకు ఉన్న పేరు, పలుకుబడితో కోర్టు కేసు నుంచి ఎలా బయటపడ్డాడు.?, ఆ కేసుకు కారణమైన పమ్మీ అనే రెజ్లర్‌నే జైలుకు పంపిస్తాడు. ఆ తర్వాత ఆమెను తిరిగి జైలు నుంచి విడిపించి తన ఆశ్రమానికే రప్పిస్తాడు. బాబాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూస్తోన్న పమ్మీ.. తాను మారిపోయినట్లుగా అందరినీ నమ్మించి ఆ తర్వాత బాబా బండారం బయటపెట్టాలని భావిస్తుంది.
View this post on Instagram
Also Read: తెలుగులో 'డ్రాగన్' హీరోయిన్ కయాదుకు గోల్డెన్ ఛాన్స్... యంగ్ హీరోతో, సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లో
బాబా వర్సెస్ లేడీ రెజ్లర్
ఇక ఈ కొత్త సీజన్‌లో బాబా వర్సెస్ పమ్మీ మధ్య ఫైట్ ఆసక్తికరంగా ఉండనున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. అంతకు ముందు సీజన్‌లో తనను తాను నపుంసకుడిగా చెప్పుకొన్న బాబా అసలు స్వరూపాన్ని ఆమె ఎలా బయటపెట్టిందో చూడొచ్చు. దేవుని ప్రతినిధిగా నిరాలా బాబాను భక్తులు ఏ విధంగా కొలిచేవారు. ఆశ్రమంలో జరిగే అత్యాచారం, హత్యల వెనుక ఉన్నది ఎవరు.?, చివరకు బాబా పరిస్థితి ఏంటి.? అనే ప్రశ్నలకు సమాధానం ఈ సీజన్ 3 పార్ట్ 2లో చూపించారు. బాబా, మాంటీసింగ్ పాత్రల్లో బాబీ డియోల్ డిఫరెంట్‌గా నటించి మెప్పించారు.
ఇలాంటి పాత్ర కోసం తాను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్లు బాబీ డియోల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సవాళ్లతో కూడిన పాత్రలు చేస్తేనే మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. 'ఈ సిరీస్ కోసం దర్శకుడు ప్రకాష్ ఝా నన్ను సంప్రదించగానే పోలీస్ అధికారి పాత్ర ఇస్తారని భావించాను. కానీ బాబా పాత్ర అని తెలిసి ఆశ్చర్యపోయాను. నేను బాబా పాత్ర పోషించగలననే పూర్తి నమ్మకం ఆయనకు ఉంది. ఇలాంటి పాత్ర లభించాలంటే పూర్తి అదృష్టం ఉండాలి. ఇది ఓ అద్భుత ప్రయాణం. నటులంతా ఇలాంటి పాత్రలు రావాలని కోరుకుంటారు.' అని పేర్కొన్నారు.
Also Read: బుల్లితెరపై రోజా రీ ఎంట్రీ - చాలా రోజుల తర్వాత ఆ షోలో జడ్జీగా మాజీ మంత్రి, ప్రోమో చూశారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

