Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
Rashmika Mandanna : కోట్లాది మంది అభిమానుల మనసులో చోటు దక్కించుకున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు ఉదయం 4 గంటలకే తినే అలవాటు ఉందన్న విషయం తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం ఇండియాలోనే బిజీయెస్ట్ స్టార్ హీరోయిన్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ హీరోయిన్ తాజాగా తనకున్న ఓ వింత అలవాటును బయట పెట్టింది. ఉదయం 4 గంటలకు ఫుడ్ తినడం గురించి రష్మిక మందన్న కామెంట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఉదయం 4 గంటలకు తిండి తినే అలవాటు
సాధారణంగా సెలబ్రిటీలు స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారు. ఎంతగా తినాలనిపించినా సరే సినిమాల కోసం నోరు కట్టుకొని మరీ హెల్దీ డైట్ ఫాలో అవుతారు. టైమ్ కి తినడమే కాదు వర్కౌట్స్ కూడా చేస్తూ సన్నజాజి తీగల్లా మెరిసిపోతారు. అయితే అప్పుడప్పుడు చీట్ డైట్ పేరుతో తమకు ఇష్టం వచ్చినవి లాగించేస్తారు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తున్న రష్మిక మందన్న మాత్రం ఏకంగా ఉదయం 4 గంటలకే ఫుడ్ తింటుందట. రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్ చేసే నటీనటులు డైట్ ఫాలో అవ్వడం కొంచెం కష్టమే. కానీ ఉదయాన్నే లేచి, వర్కౌట్స్ లాంటివి చేస్తూ ఉంటారు. రష్మిక మాత్రం తెల్లవారుజామున 4 గంటలకు మ్యాగీని లాగిస్తున్న ఫోటోని షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.
తన సోషల్ మీడియా ఖాతాలో రష్మిక తాను అలా ఉదయాన్నే స్నాక్స్ లేదా చిరు తిండి తినడం గురించి వెల్లడించింది. బౌల్స్ లో మ్యాగీ ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసి, "ఉదయం 4 గంటల స్నాక్" అని దానికి క్యాప్షన్ ఇచ్చింది. అయితే రాత్రిళ్ళు లాంగ్ నైట్ షూటింగ్ ఉన్నప్పుడు ఆమె ఇలా స్నాక్స్ లాంటి ఫుడ్ తినడానికి ఇష్టపడుతుందట. ఇది షూటింగ్ ను మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది అనేది రష్మిక ఉద్దేశమట. అలా రష్మిక మందన్న తనకున్న వింత అలవాటును బయట పెట్టింది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ
Rashmika Upcoming Movies: ఇటీవలే 'పుష్ప 2', 'ఛావా' సినిమాలతో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక ప్రస్తుతం 'సికందర్' మూవీతో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా, సల్మాన్ ఖాన్ ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. నిజానికి ఈ మూవీ షూటింగ్ విడుదల ఆలస్యం అవుతుందని రూమర్లు వినిపించాయి. దానికి కారణం రష్మిక మందన్న. జిమ్లో వర్కర్స్ చేసినప్పుడు ఆమెకు గాయం కావడం కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ రష్మిక డెడికేషన్ తో గాయం తగ్గగానే షూటింగ్లో పాల్గొంది. ఇక 'సికందర్' మూవీ మార్చ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి వంటి స్టార్స్ నటిస్తున్నారు. అలాగే రష్మిక ధనుష్ తో కలిసి 'కుబేర', ఆయుష్మాన్ ఖురానాతో 'థామ' వంటి బిగ్ ప్రాజెక్టులలో భాగమవుతుంది.
Also Read: సమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్





















