Salaar Re Release: ఖాన్సార్‌కు తిరిగి వస్తున్న దేవా... 'సలార్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్... డార్లింగ్ ఫాన్స్‌కు పూనకాలే
Salaar Re Release Date: ప్రభాస్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్'. ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి రానుంది. రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్

ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ వచ్చేసింది. ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'సలార్' మూవీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ ను తాజాగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఖాన్సార్ కు తిరిగి వస్తున్న దేవా
'బాహుబలి' తర్వాత ప్రభాస్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ అంత ఈజీగా పడలేదు. ఆయన హీరోగా నటించిన సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకులను నిరాశపరిచాయి. పైగా ప్రభాస్ లుక్ పై ట్రోలింగ్ రావడానికి కూడా ఇది దారి తీసింది. ఇలాంటి క్రూషియల్ టైంలో 'కేజీఎఫ్' రెండు భాగాలతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఇండియన్ బాక్స్ ఆఫీసును షేక్ చేశారు. అంతే కాదు ఆయన మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అలాంటి దర్శకుడితో, ప్రభాస్ హీరోగా అనౌన్స్ చేసిన 'సలార్' మూవీ భారీ అంచనాలతో తెరకెక్కింది. డార్లింగ్ తో పాటు ఆయన అభిమానులంతా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. కలెక్షన్లు ఊహించని రేంజ్ లో రావడంతో నిర్మాతలు ఖుషి అయ్యారు. తాజాగా ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో ఎగిరి గంతేస్తున్నారు డార్లింగ్ అభిమానులు. ఈ మేరకు మార్చి 21న 'సలార్' మూవీని థియేటర్లలోకి మరోసారి తీసుకురాబోతున్నట్టు ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. మరి మరోసారి ఖాన్సార్ సామ్రాజ్యంలోకి దేవా అడుగు పెట్టడాన్ని ప్రేక్షకులు థియేటర్లలో ఎలా ఎంజాయ్ చేయబోతున్నారో చూడాలి.
#Salaar RE - RELEASING On 𝐌𝐚𝐫𝐜𝐡 𝟐𝟏𝐬𝐭 !#Prabhas pic.twitter.com/M2x2zqxTZ1
— Karthik_ rebelism (@KNagolu36024) February 24, 2025
2023 డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ముఖ్యంగా సినిమాలో హీరోను ప్రశాంత్ వర్మ ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాడు. యాక్షన్ సీన్స్ సైతం గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండడంతో మూవీ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఇందులో అసలు కథ చెప్పకుండా సెకండ్ పార్ట్ కోసం ప్రశాంత్ నీల్ దాచాడని విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ ఈ మూవీతో ప్రభాస్ అభిమానులను మెప్పించాడు ప్రశాంత్ నీల్.
సమ్మర్లో ప్రభాస్ సందడి
'సలార్' తర్వాత ప్రభాస్ నటించిన 'కల్కి' మూవీ మరో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఏడాది ప్రభాస్ నుంచి 'ది రాజాసాబ్' మూవీ రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో 'ది రాజా సాబ్'తో పాటు 'సలార్' కూడా థియేటర్లలోకి దిగబోతోంది కాబట్టి, వసూళ్లు కుమ్మేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. 'సలార్'లో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్, శ్రియా రెడ్డి, బాబీ సింహా తదితరులు కీలకపాత్రలు పోషించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

