అన్వేషించండి

Happy Birthday Nandamuri Kalyan Ram: నందమూరి కల్యాణ్ రామ్ ఎంతమంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారో తెలుసా?

HBD Kalyan Ram: టాలీవుడ్ హీరో, నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు నేడు (జూలై 5). ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తూ, ఆయన సినీ జర్నీని ఇప్పుడు చూద్దాం.

Happy Birthday Nandamuri Kalyan Ram: నందమూరి తారక రామారావు మనవడిగా, నందమూరి ఫ్యామిలీ మూడో తరం నట వారసుడిగా హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు కల్యాణ్ రామ్. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే, మరోవైపు కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌లతో అలరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. నేడు నందమూరి కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని తెలుసుకుందాం.

* కళ్యాణ్ రామ్ 1978 జూలై 5న నందమూరి హరికృష్ణ, లక్ష్మీ కుమారి దంపతులకు జన్మించారు. హైదరాబాద్‌, విజయవాడలలో ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్నాడు. కోయంబత్తూరులో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేశాడు.

* బీటెక్ పూర్తయిన వెంటనే సినిమాల్లోకి రావాలని అనుకున్నాడు కల్యాణ్ రామ్. కానీ తమ ఫ్యామిలీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వ్యక్తి ఎవరూ లేరని తండ్రి హరికృష్ణ పట్టుబట్టడంతో, విదేశాలకు వెళ్లి మాస్టర్స్‌ చేశాడు.

* 1989లో తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'బాల గోపాలుడు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేశాడు కల్యాణ్ రామ్. ఆ తర్వాత పూర్తిగా చదువుల మీదనే దృష్టి పెట్టారు.

* 2003లో ఉషా కిరణ్ బ్యానర్ లో 'తొలి చూపులోనే' చిత్రంతో హీరోగా లాంఛ్ అయ్యారు. కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత అశ్వినీదత్ నిర్మాణంలో చేసిన 'అభిమన్యుడు' కూడా పరాజయం పాలైంది.

* తాత ఎన్‌టి రామారావు పేరు మీదుగా సొంతంగా 'ఎన్టీఆర్ ఆర్ట్స్‌' అనే బ్యానర్ స్థాపించి సినీ నిర్మాణంలో అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంగా సురేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన 'అతనొక్కడే' (2005) సినిమా కళ్యాణ్ రామ్ కు ఫస్ట్ సక్సెస్ రుచి చూపించింది. అప్పటి నుంచి ఆయన ఎక్కువగా తన హోం ప్రొడక్షన్ లోనే నటిస్తూ వచ్చారు.

* 2006 - 2013 మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ అర డజనుకు పైగా డిజస్టర్లు అందుకున్నారు. 'అసాధ్యుడు', 'లక్ష్మీ కళ్యాణం', 'విజయ దశమి', 'జయీభవ', 'కల్యాణ్ రామ్ కత్తి', 'ఓం 3డీ' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చవిచూశాయి.

* కల్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ ప్లే చేసిన 'హరే రామ్' మూవీ కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇది ఫ్లైక్యామ్‌ ని ఉపయోగించిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. భారతదేశంలోనే మొట్టమొదటి 3డి యాక్షన్ చిత్రంగా ప్రచారం చేయబడిన 'ఓం 3డి' సినిమా కల్యాణ్ రామ్ కి తీవ్ర నష్టాలను మిగిల్చింది.

* 2015 కల్యాణ్ రామ్ నటించిన 'పటాస్' సినిమా పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఆ వెంటనే వచ్చిన 'షేర్' ఫ్లాప్ గా మారింది.

* పూరీ జగన్నాథ్ తో చేసిన 'ఇజం' (2016) సినిమా మిక్స్డ్ రివ్యూస్ అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద యావరేజ్ వసూళ్లు సాధించింది. దీనికి తర్వాత వచ్చిన 'ఎమ్మెల్యే', 'నా నువ్వే' చిత్రాలు ఫెయిల్యూర్స్ గా మారాయి. బాబాయ్ తో కలిసి నటించిన 'ఎన్టీఆర్ - కథానాయకుడు' 'ఎన్టీఆర్ - మహానాయకుడు' సినిమాలు డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాయి.

* సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ డైరెక్షన్ లో కల్యాణ్ రామ్ నటించిన '118' చిత్రం కమర్షియల్ హిట్ గా నిలిచింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చేసిన 'ఎంత మంచివాడవురా' (2020) మూవీ మాత్రం ఫ్లాప్ అయింది.

* 2022లో వశిష్ఠ దర్శకత్వం వహించిన 'బింబిసార' సినిమా కల్యాణ్ రామ్ కు భారీ విజయాన్ని అందించింది. దీని తర్వాత రిలీజైన 'అమిగోస్' చిత్రంలో త్రిపాత్రాభినయం చేసినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 'డెవిల్ - ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' (2023) మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.
 
* కల్యాణ్ రామ్ ఇప్పటి వరకూ మల్లిఖార్జున్, సురేందర్ రెడ్డి, అనిల్ కృష్ణ, హర్షవర్ధన్, నరేన్ కొండేపాటి, సునీల్ రెడ్డి, అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, జయేంద్ర పంచపకేశన్, మల్లిడి వశిష్ఠ, రాజేంద్ర రెడ్డి, అభిషేక్ నామా వంటి 12 మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ను డైరెక్టర్ గా టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ చేశారు.

* కల్యాణ్ రామ్ తన బ్యానర్ లో 10 సినిమాలను నిర్మించారు. బయట హీరోతో చేసిన ఒకే ఒక్క చిత్రం 'కిక్ 2'. రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ప్లాప్ అయింది. 

* తన సోదరుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో 'జై లవకుశ' చిత్రాన్ని నిర్మించిన కల్యాణ్ రామ్.. ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' పార్ట్-1 సినిమా నిర్మాణంలో భాగం అయ్యారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో తారక్ చేయబోయే 'డ్రాగన్' మూవీ ప్రొడక్షన్ లోనూ పాలుపంచుకోబోతున్నారు.

* కల్యాణ్ రామ్ 2006 ఆగస్టులో స్వాతిని వివాహం చేసుకున్నారు. వీరికి తారక అద్వైత, శౌర్య రామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

* కుమార్తె పేరు మీదుగా అద్విత క్రియేటివ్ స్టూడియోస్ అనే వీడియో ఎఫెక్ట్స్ కంపెనీని ప్రారంభించారు కల్యాణ్ రామ్. ఇది లెజెండ్ , నాన్నకు ప్రేమతో, కృష్ణాష్టమి వంటి సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించింది. 

Also Read: 'కల్కి' సినిమాకు సంగీతం అందించిన కీరవాణి, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP DesamPrakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desamపసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Cake and Cancer Risk : కేక్స్ తింటే క్యాన్సర్ వస్తుందా? కర్ణాటక గవర్న్​మెంట్ ఇచ్చిన హెచ్చరికలు ఏంటి? నిపుణుల సూచనలు ఇవే
కేక్స్ తింటే క్యాన్సర్ వస్తుందా? కర్ణాటక గవర్న్​మెంట్ ఇచ్చిన హెచ్చరికలు ఏంటి? నిపుణుల సూచనలు ఇవే
Embed widget