Tirupati News: తిరుపతిలో హీటెక్కిన రాజకీయం, డిప్యూటీ మేయర్‌ను టార్గెట్ చేసిన వైసీపీ
Tirupati News: తిరుపతి రాజకీయం సోషల్ మీడియా వేదికగా వేడెక్కింది. నూతన డిప్యూటీ మేయర్ ఆర్సీ ముని కృష్ణ టార్గెట్ గా వైసీపీ మాటల యుద్దం చేస్తుంది. ఇది ఎప్పటికి తేలుతుందో వేచి చూడాలి.

Tirupati News: తిరుపతి: తిరుపతి రాజకీయాలు సోషల్ మీడియాలో హీటెక్కాయి. నిన్నటి వరకు ఎన్నికల వేడి నుంచి బయటపడగా.. కూటమి డిప్యూటీ మేయర్ టార్గెట్ గా రాజకీయం సాగుతుంది. తిరుపతి రాజకీయం ఎప్పుడు కొత్తగా ఉంటుంది. తిరుపతి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తుంటాయి. తిరుపతి ఎన్నికలు, ఫలితాలు సైతం హాట్ టాపిక్ గా మారాయి.
ఇటీవల డిప్యూటీ మేయర్ ఎన్నిక
తిరుపతిలో ఇటీవల డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. 25 సంవత్సరాల తరువాత తిరుపతి కార్పొరేషన్ అయిన తరువాత తొలిసారి గత నాలుగేళ్ల క్రితం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అప్పటి అధికార వైసీపీ పార్టీ టీడీపీ నాయకులను కనీసం పోలింగ్ బూత్ వరకు సైతం వెళ్లనివ్వకుండా చేశారు. ధన, ఆర్థిక, అంగ బలంతో 50 డివిజన్లకు గాను 18 డివిజన్ ఎన్నికలు మినహా 49 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఒకటి ఎన్నిక జరగలేదు.
ఆ తరువాత మేయర్ గా బీసీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ గా ముద్ర నారాయణను నిలబెట్టారు. వైసీపీ ప్రభుత్వం రెండో డిప్యూటీ మేయర్ పదవికి జీవో విడుదల చేసింది. దీంతో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు.. కార్పొరేటర్ భూమన అభినయ్ రెడ్డి ని రెండో డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవం చేశారు. 2024 ఎన్నికల్లో తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఉన్న భూమన అభినయ్ రెడ్డి ని ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేయించగా ఓటమి పాలయ్యారు. దీంతో డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఆ పోస్టు ఖాళీ అయ్యింది.
కష్టపడి పోరాడిన ఆర్సీ
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మొదటి రోజు కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. తొలిరోజు తమ కార్పొరేటర్లను కూటమి నాయకులు కిడ్నాప్ చేశారని వారు వైసీపీ నాయకులు ఆరోపించారు. రెండో రోజు 26 మంది కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థి ఆర్సీ ముని కృష్ణ కు ఓటు వేసి రెండో డిప్యూటీ మేయర్ గా ఎన్నుకున్నారు.
మొదలైన వివాదం
ఒకే కార్పొరేటర్గా తిరుపతిలో టీడీపీ తరపున గెలిచిన ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఆయన గెలుపు, ఎన్నిక తీరు పై వైసీపీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా ఆర్సీ ముని కృష్ణ టార్గెట్ గా మాటలకు పని చెప్పారు. దీనికి ఆర్సీ ప్రెస్ మీట్ పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి పై విమర్శలు చేశారు. దానిని ప్రధానం గా తీసుకుని వైసీపీ తరపున ఉన్న డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు ఆర్సీ ఎన్నిక పై ఆయన చేసిన పనులు, వ్యక్తి గత విషయాల నుండి అన్నింటిని మాట్లాడుతున్నారు.
అన్నింటికి ఆర్సీ ముని కృష్ణ తొలిసారి సోషల్ మీడియా వేదికగా తనపై వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. కరుణాకర్ రెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు, తాతయ్యగుంట గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ పై మాట్లాడారు. దానిలో ఆయన మాట్లాడిన మాటల పై తిరిగి వైసీపీ నాయకులు సోషల్ మీడియా లో ఆరోపణలు చేస్తున్నారు. దీనిని పరిశీలిస్తున్న ప్రజలు మాత్రం.. వారు ఎన్నిక ఎలా సాగిందో తెలుసు.. వీరి గెలుపు ఎలా వచ్చిందో అందరికీ తెలుసు.. సోషల్ మీడియా లో వీల్ల గొడవలు మనకు అవసరం ఏమిటని చర్చించుకుంటున్నారు.





















