అన్వేషించండి

Kubera Movie: బ్యాంకాక్‌కు 'కుబేర'.. వింటేజ్ లుక్ లో కింగ్ నాగ్!

Kubera Movie: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు.

Kubera Movie Shooting Update: నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ సినిమా 'కుబేర'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ధనుష్ డిఫరెంట్ అవతార్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. కుబేర అని టైటిల్ పెట్టి హీరోని చిరిగిపోయిన దుస్తుల్లో ఒక బిచ్చగాడిగా చూపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే మేకర్స్ తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ అందించారు.

'కుబేర' సినిమా కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌ను బ్యాంకాక్‌లో ప్రారంభించినట్లు చిత్ర బృందం తెలిపింది. నాగార్జునతో పాటు మరికొందరు ప్రధాన నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ సన్నివేశాలను, యాక్షన్ పార్ట్‌లు చిత్రీకరించనున్నారు. ఇంతకు ముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోందని చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

వర్కింగ్ స్టిల్ లో నాగార్జున, డైరెక్టర్ శేఖర్ కమ్ముల సీన్ గురించి డిస్కస్ చేస్తూ కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో వండర్ ఫుల్ వ్యూని గమనించవచ్చు. అయితే ఇక్కడ నాగ్ లుక్ రివీల్ అవ్వకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. ఆయన బ్యాక్ సైడ్ లుక్ మాత్రమే ఈ ఫొటోలో కనిపించింది. అయినప్పటికీ లాంగ్ హెయిర్ తో కళ్లద్దాలు పెట్టుకుని నీట్ గా టక్ చేసుకొని క్లాస్ గా ఉండటాన్ని బట్టి చూస్తే, నాగార్జున ఈ మూవీలో వింటేజ్ లుక్ లో కనిపిస్తారని అర్థమవుతుంది. ఇందులో ధనుష్ విభిన్నమైన షేడ్స్ ఉన్న మాఫియా డాన్ పాత్రలో నటిస్తుండగా.. అతన్ని వెంటాడే ఈడీ ఆఫీసర్ పాత్రలో నాగ్ నటిస్తున్నారని టాక్ నడుస్తోంది.

'కుబేర' డిఫరెంట్ కాన్సెప్ట్ తో, శేఖర్ కమ్ముల ఘన జోనర్ నుంచి బయటకి వచ్చి తెరకెక్కిస్తున్న సినిమా. స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రామకృష్ణ సబ్బని, మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైనర్లుగా వర్క్ చేస్తున్నారు.

ఇలా నేషనల్ ఫిలిం అవార్డ్స్ అందుకున్న తమిళ హీరో ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల, దేవీశ్రీ ప్రసాద్, అక్కినేని నాగార్జున ('అన్నమయ్య' చిత్రంలో అధ్బుతమైన నటనకు గాను జాతీయ స్థాయి స్పెషల్ జ్యూరీ పురస్కారం) లాంటి నలుగురు ప్రముఖులు కలిసి వర్క్ చేస్తున్న 'కుబేర' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఆసియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు.

Also Read: ప్రభాసే నంబర్ వన్ - ట్విట్టర్ టాప్ హ్యాష్ ట్యాగ్స్‌లో ఏకైక హీరోగా రెబల్ స్టార్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget