Chhaava Trailer: సింహాన్ని చీల్చి చెండాడిన శంభాజీ... మొఘల్స్‌కు ముచ్చెమటలు పట్టించిన ధీరుడు... గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'ఛావా' ట్రైలర్
Chhaava Trailer Review: ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, ఆయన తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన యోధుడు, మొఘల్స్ పాలిట సింహ స్వప్నంగా మారిన శంభాజీ జీవితంపై రూపొందిన 'ఛావా' సినిమా ట్రైలర్ విడుదలైంది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించాడని, ఇక తమకు అడ్డు లేదని, మరాఠా సామ్రాజ్యాన్ని సైతం ఏలాలని కలలు కన్న మొఘల్స్ పాలిట, ముఖ్యంగా ఔరంగజేబు పాలిట శివాజీ తనయుడు శంభాజీ సింహ స్వప్నంగా ఎలా మారాడు? తన సైనికులు, ప్రజలతో కలిసి ఏ విధమైన పోరాటం చేశాడు? తన తండ్రి కలలు కన్న స్వరాజ్యం కోసం ఏం చేశాడు? అనేది వెండి తెరపై చూపించనున్న సినిమా 'ఛావా'.
గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'ఛావా' ట్రైలర్
'ఛావా' సినిమాలో శివాజీ వారసుడిగా, ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో యంగ్ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించారు. ఇందులో ఆయనకు జోడిగా మహారాణి యేసు బాయి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున 'ఛావా' విడుదల కానుంది. ఇవాళ ముంబైలో జరిగిన కార్యక్రమంలో సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
'ఛావా' అంటే సింహానికి పుట్టిన బిడ్డ, సింహం వారసుడు అని అర్థం. ఛావా ఇంకా అడవుల్లోనే తిరుగుతోందనే మాటతో ట్రైలర్ ప్రారంభమైంది. వీరోచిత పోరాట యోధుడిగా శంభాజీని పరిచయం చేశారు. ఆ పాత్రలో విక్కీ కౌశల్ జీవించారు. యాక్షన్ సీక్వెన్సులు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ''మేం గోల చేయం... వేటాడతాం'' అని వికీ కౌశల్ చెప్పే డైలాగ్ గాని, ఆ విజువల్స్ గాని ఎక్స్ట్రార్డినరీ అని చెప్పాలి. సింహాన్ని శంభాజీ చీల్చి చెండాడే సన్నివేశం గురించి ఎంత చెప్పినా తక్కువే.
Also Read: పాపం రష్మిక... కుంటి కాలుతో ఎయిర్ పోర్టులో ఎన్ని కష్టాలు పడిందో ఈ ఫోటోల్లో చూడండి
భారత దేశ స్వరాజ్యం కోసం శంభాజీ ఎటువంటి పోరాటం చేశాడనేది సినిమా కథ అని స్పష్టంగా తెలుస్తోంది. ఖర్చుకు అసలు ఏమాత్రం ఆలోచించకుండా మ్యాడ్ లాక్ ఫిలిమ్స్ సినిమా ప్రొడ్యూస్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 'స్త్రీ 2' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. ఇందులో మహారాణి యేసు బాయిగా రష్మిక మందన్న పాత్రకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది. భర్తకు ఆవిడ ఏ విధమైన సహకారం అందించిందనేది కొంచెం చూపించారు.
కాషాయం కనిపిస్తే రక్తపాతం సృష్టించండి!
'ఛావా' సినిమాలో ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. ఆయన మేకోవర్ అద్భుతంగా ఉంది. ఆయన ఫస్ట్ లుక్ విడుదల అయ్యాక చాలా మంది గుర్తు పట్టలేదని చెబితే అతిశయోక్తి కాదు. 'ఎక్కడెక్కడ కాషాయం కనిపిస్తే దాన్ని ఎరుపుగా మార్చేయండి' అని తన సైనికులను ఔరంగజేబు ఆదేశిస్తాడు. అంటే కాషాయం (హిందువులు) కనిపిస్తే ఆ ప్రాంతమంతా రక్తపాతం సృష్టించాలని, అక్కడి మనుషులను చంపేయాలని ఆదేశాలు ఇచ్చారన్నమాట. ఔరంగజేబు చేసిన ఆకృత్యాలను చూపించారు. తాను మరణిస్తే ప్రతి ఇంటిలో ఒక శివాజీ లేదా శంబాజీ జన్మిస్తాడని అదే నువ్వు మరణిస్తే మొగల్ సామ్రాజ్యం బూడిద అవుతుందని ఔరంగజేబుకు శంభాజీ ఇచ్చే వార్నింగ్ దేశ భక్తులకు గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: టాలీవుడ్ తాట తీస్తున్న ఐటీ రైడ్స్... అసలు టార్గెట్ దిల్ రాజు కాదా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

