అన్వేషించండి

Deepika Padukone: దీపికా 1000 కోట్ల హ్యాట్రిక్ - పెద్ద సినిమాలకు గోల్డెన్ లెగ్‌గా మారిన సొట్టబుగ్గల సుందరి!

Deepika Padukone ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సాధించింది. ఈ క్రమంలో ఆమె ఓ అరుదైన ఘనత సాధించింది.

Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకొని, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. హీరో రణవీర్ సింగ్ తో వివాహ బంధంలో అడుగు పెట్టిన దీపికా.. పెళ్ళి తర్వాత కూడా సినీ కెరీర్ ను కొనసాగించింది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఓ అరుదైన ఘనత సాధించింది.

'కల్కి 2898 AD' సినిమాతో దీపికా పదుకునే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో SUM-80 అలియాస్ సుమతి పాత్రలో ఆమె నటించింది. ప్రాజెక్ట్ K గర్భిణీ ల్యాబ్ సబ్జెక్ట్ గా, కల్కిని కడుపున మోసిన యువతిగా మంచి నటన కనబరిచింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లోనే ₹1000 కోట్ల క్లబ్ లో చేరింది. 

గతేడాది దీపికా పదుకునే 'పఠాన్' సినిమాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు జోడీగా నటించిన సంగతి తెలిసిందే. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. ₹1,050 కోట్లు రాబట్టింది. అలానే అట్లీ డైరెక్షన్ లో కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా నటించిన 'జవాన్' మూవీలోనూ భాగమైంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో షారుక్ భార్యగా కనిపించింది. ఇది బాక్సాఫీస్ దగ్గర ₹1,148 కోట్లు వసూళ్ళు సాధించింది. ఇలా దీపిక ఏడాది కాలంలో మూడు 1000 కోట్ల గ్రాస్ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. 

మూడు 1000 కోట్ల సినిమాల్లో దీపికా...
'బాహుబలి 2', 'దంగల్', RRR, 'కేజీఎఫ్ 2', 'పఠాన్', 'జవాన్' లాంటి భారతీయ చిత్రాలు 1000 కోట్ల క్లబ్ లో ఉన్నాయి. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' మూవీ కూడా ఈ లిస్టులో చేరడంతో.. దీపిక ఖాతాలో మూడు వెయ్యి కోట్ల సినిమాలు వచ్చి చేరినట్లైంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఏ హీరోయిన్ కు కూడా ఇలాంటి అరుదైన అవకాశం దక్కలేదు. హీరోలలో మాత్రం ప్రభాస్, షారుఖ్ ఖాన్ చెరో రెండేసిసార్లు వెయ్యి కోట్లకి పైగా వసూళ్లు అందుకున్నారు. దీన్ని బట్టి దీపికాది గోల్డెన్ లెగ్ అనే అనుకోవాలి.

2006లో 'ఐశ్వర్య' అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసిన దీపికా పదుకునే.. 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి, బీ టౌన్ జనాల దృష్టిని ఆకర్షించింది.. క్రేజీ ఆఫర్లు అందుకుంది. అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దాదాపు 18 ఏళ్ల తర్వాత కల్కి '2898 AD' సినిమాతో మళ్ళీ సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 'కల్కి 2' లోనూ భాగం కానుంది. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపికా.. సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. ఆమె కీలక పాత్రలో నటించిన 'సింగం ఎగైన్' సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Also Read: మెగా ఫ్యాన్స్‌కు ‘భారతీయుడు 2’ టెన్షన్ - భయం అక్కర్లేదు, ఎందుకంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Disha Patani Dance Controversy | ఐపీఎల్ వేడుకల్లో దిశా పటానీ డ్యాన్సులపై భారీ ట్రోలింగ్ | ABP DesamKKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Telugu TV Movies Today: విజయ్ ‘GOAT’, పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ to ఎన్టీఆర్ ‘అదుర్స్’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ వరకు - ఈ ఆదివారం (మార్చి 23) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
విజయ్ ‘GOAT’, పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ to ఎన్టీఆర్ ‘అదుర్స్’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ వరకు - ఈ ఆదివారం (మార్చి 23) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
IPL 2025 RCB VS KKR Result Update: కోహ్లీ, సాల్ట్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీలు.. కేకేఆర్ ను బోల్తా కొట్టించిన ఆర్సీబీ.. ఫ‌స్ట్ మ్యాచ్ లో పాటిదార్ సేన‌ ఘ‌న విజ‌యం
కోహ్లీ, సాల్ట్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీలు.. కేకేఆర్ ను బోల్తా కొట్టించిన ఆర్సీబీ.. ఫ‌స్ట్ మ్యాచ్ లో పాటిదార్ సేన‌ ఘ‌న విజ‌యం
Online Gaming Websites:357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
Embed widget