అన్వేషించండి

Deepika Padukone: ప్రఖ్యాత హోటల్స్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపిక

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకు అరుదైన అవకాశం లభించింది. ప్రపంచ ప్రఖ్యాత హిల్టన్ హోటల్స్ కు గ్లోబల్ అంబాసిడర్ గా ఎంపిక అయ్యింది. హిల్టన్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని దీపికా వెల్లడించింది.

Deepika As The Global Brand Ambassador Of A Hilton Hotels: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ ప్రసిద్ధ హిల్టన్ హోటల్స్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నట్లు తెలిపారు. హిల్టన్ హోటల్స్ సంస్థ సైతం తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇప్పటి నుంచి అమెరికన్ మల్టీనేషనల్ హాస్పిటాలిటీ కంపెనీని హిల్టన్‌ ను దీపికా ప్రమోట్ చేయనున్నట్లు తెలిపింది.  భారతదేశంలో 17 హోటళ్లను ఏర్పాటు చేసే దిశగా హిల్టన్ కంపెనీ ప్రయత్నిస్తోంది.

హిల్టన్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

తనను గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం పట్ల దీపికా పదుకొణె సంతోషం వ్యక్తం చేసింది. ఇంత గొప్ప అవకాశం కల్పించిన హిల్టన్ కు ధన్యవాదాలు చెప్పింది. “ప్రపంచవ్యాప్త భారతీయుల కోసం హిల్టన్ వంటి గ్లోబల్ బ్రాండ్‌తో భాగస్వామ్యం అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ తరం యువత చాలా కష్టపడి పని చేస్తున్నారు. మేము వెచ్చించే ప్రతి రూపాయిలో చక్కటి విలువను కోరుకుంటాం. అలాంటి విలువను హిల్టన్ అందిస్తుంది. హిల్టన్ విషయంలో నాకు నచ్చేది ఏంటంటే? మీరు హోటల్ లాబీలోకి అడుగు పెట్టకముందే మీ అవసరాలను ఊహించి, అనుకూలంగా ఉండేలా చూస్తారు. హిల్టన్‌తో శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి, వాటిని ప్రపంచంతో పంచుకోవడానికి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను” అని దీపికా వెల్లడించింది.

దీపికను హిల్టన్ ఎందుకు ఎంచుకుందంటే?

బాలీవుడ్ బ్యూటీ దీపికాను ఎందుకు తమ కంపెనీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని హిల్టన్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మార్క్ వైన్‌స్టెయిన్ వెల్లడించారు. దీపికా పదుకొణె హిల్టన్‌కు ఆదర్శవంతమైన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండబోతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్‌ లో ప్రెజెంటర్‌ దీపికా చక్కగా ఆకట్టుకున్నట్లు వెల్లడించారు. “భారతదేశంలో దీపికా ఐకానిక్ స్టేటస్, ఆధునిక సంప్రదాయం మేళవింపుతో హిల్టన్‌కు ఆదర్శవంతమైన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. దీపికాతో భాగస్వామ్యంతో  హిల్టన్ స్టే మరింత ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

దీపిక ప్రమోట్ చేస్తున్న ఇతర అంతర్జాతీయ బ్రాండ్లు

ఇప్పటికే దీపికా పదుకొణె పలు అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. కార్టియర్, లూయిస్ విట్టన్ లాంటి ఐకానిక్ డిజైనర్ లేబుల్స్ ను ప్రమోట్ చేస్తోంది. ఆగస్టు 2023 నుంచి UK-ఆధారిత డైసన్ హెయిర్ కేర్ టెక్నాలజీస్ అంబాసిడర్‌గానూ కొనసాగుతోంది.  ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ సంస్థకు కూడా ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అయితే  హ్యుందాయ్ మోటార్‌ ఇండియాకు మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. షారుక్‌ తర్వాత సినిమా పరిశ్రమ నుంచి కార్ల తయారీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వారిలో రెండో వ్యక్తిగా దీపికా నిలిచింది.

Read Also: ఈ వీకెండ్‌లో అలరించే సినిమాలు ఇవే - ఆ హిట్ మూవీ కూడా ఈ వారమే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH vs RR Top 5 players: ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
NTR: 'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP DesamFan Touched feet of Virat Kohli | KKR vs RCB మ్యాచ్ లో కొహ్లీపై అభిమాని పిచ్చి ప్రేమ | ABP DesamVirat Kohli vs KKR IPL 2025 | 18వ సారి దండయాత్ర మిస్సయ్యే ఛాన్సే లేదు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH vs RR Top 5 players: ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
NTR: 'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
Allu Arjun: అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
IPL 2025 CSK VS MI Updates: ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
Viral News: పన్ను కట్టలేదని ఇంటి గేటుకు తాళం వేసిన అధికారులు, మంచిర్యాల జిల్లాలో ఘటన
పన్ను కట్టలేదని ఇంటి గేటుకు తాళం వేసిన అధికారులు, మంచిర్యాల జిల్లాలో ఘటన
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Embed widget